అత్యవసర సందర్భాల్లో ఉచితంగా రేమేడీస్వర్ ఇంజక్షన్

0
136
Spread the love

అత్యవసర సందర్భాల్లో ఉచితంగా రేమేడీస్వర్ ఇంజక్షన్
విభిన్న సేవాకార్యక్రమం ప్రారంభించిన ఉపసభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు
సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఉచిత సేవలు


సికింద్రాబాద్: కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపధ్యంలో ఇటీవలి కాలంలో అత్యవస సందర్భాల్లో రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఉపకరించే రేమేడిస్వేర్ వంటి ప్రాణాధార ఇంజక్షన్ల కొరత వాల్ల కరోనా రోగులు, వ్యాధి లక్షణాలు కలిగిన వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి రావడంతో పాటు మృత్యువాత కూడా పడుతున్న పరిస్థితుల్లో తెలంగాణ ఉప సభాపతి శ్రీ తీగుళ్ల పద్మారావు గౌడ్ గారు తన వంతుగా మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అత్యవసర సందర్భాలలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారికీ రెమేడిస్వర్ ఇంజక్షన్ లను పూర్తిగా ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు జరిపారు.
– ఈ మందును తయారు చేసే సంస్థను నేరుగా సంప్రదించి, తన సొంత డబ్బులతో ఇంజెక్షన్ లను సమకూర్చుకొని సిద్ధం చేసుకొని అత్యవసర సందర్భాల్లో డాక్టర్ల సూచనల మేరకు రోగులకు ఈ ఇంజక్షన్ లను ఉచితంగా అందించేలా ఏర్పాట్లు జరిపారు. సికింద్రాబాద్ లోని శ్రీకర ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించి సికింద్రాబాద్ నియోజకవర్గానికి కు చెందిన కరోనా రోగులకు ఉచితంగా ఈ ఇంజక్షన్ అందించేలా ఏర్పాట్లు చేశారు.
– అదే విధంగా ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్ లను కూడా అత్యవసర సందర్భాల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రోగులకు ఉచితంగా అందించేందుకు శ్రీ పద్మారావు గౌడ్ ఏర్పాట్లు జరిపారు. గత జూన్ మాసంలో ఆక్సిజన్ సిలిండర్ ల ఉచిత పంపీణీ ని ప్రారంభించి ఇప్పటికే వందలాది మంది రోగులకు అత్యవసర సందర్బాలలో ప్రాణ వాయువును శ్రీ పద్మారావు గౌడ్ గారు అందించారు. గతంలో సికింద్రాబాద్ పరిధిలో 11 వేల కుటుంబాలకు రూ.1.25 కోట్ల సొంత ఖర్చుతో శ్రీ పద్మారావు గౌడ్ నిత్యావసర సరకులను గతంలో అందించి లాక్ డౌన్ సందర్భంలో సికింద్రాబాద్ ప్రజలను ఆదుకున్నారు.
– పేదలకు ఉపకరించేలా తాము అందిస్తున్న ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, రేమేడీస్వర్ ఇంజక్షన్ అత్వసరమైన వారు సితాఫలమండీ లోని తమ క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని శ్రీ పద్మారావు గౌడ్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here