స్వర్గీయ ఎన్టీయార్ స్పూర్తితో దేశ సేవలో నిమగ్నమవుతాం – నందమూరి బాలకృష్ణ

0
296
Spread the love

స్వర్గీయ ఎన్టీయార్ స్పూర్తితో దేశ సేవలో నిమగ్నమవుతాం – నందమూరి బాలకృష్ణ

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో 70 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హాస్పిటల్ ఆవరణలో శ్రీ నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారు జాతీయ జెండాను ఎగురవేశారు. జెండా ఎగురవేసిన సందర్భంగా ఇండో అమెరికన్ నర్సింగ్ స్కూలు మరయు కాలేజీ విద్యార్థిణిలు జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం త్రివర్ణాలలో ఉన్న ఎయిర్ బెలూన్ లను శ్రీ నందమూరి బాలకృష్ణ తదితరులు గాలిలో ఎగురవేశారు.

ఈ సందర్భంగా హాజరైన సభికులనుద్దేశించి శ్రీ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ నాడు ఎందరో మహానుభావుల త్యాగఫలితంగానే స్వాతంత్ర్యం సిధ్దించిందని అనంతరం శ్రీ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం నేటికీ నిలిచి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతోందని అన్నారు. అందరితో కలసి మానవతా విలువలతో పని చేయడమే దేశానికి నిజమైన సేవ అంటూ ఈ దిశగా పని చేసిన వారిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒకరని కొనియాడారు. నాడు స్వర్గీయ NTR ఈ లక్ష్యం కోసం పని చేస్తూ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల మనస్సులో నిలిచిపోయాయని అన్నారు. అలానే తెలుగువారి గుర్తింపు కోసం నిరంతరం కృషి చేసిన స్వర్గీయ యన్ టి ఆర్ స్పూర్తితోనే ప్రజాసేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అదే స్పూర్తితో నెలకొల్పబడిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ సాగిస్తున్న ప్రగతిని ప్రశంసించిన శ్రీ బాలకృష్ణ ఈ దిశగా నిబద్దతతో పని చేస్తున్న సిబ్బందిని అభినందించారు.

అనంతరం కార్యక్రమానికి ఎంతో ఉత్సుకతతో హాజరైన పిల్లలకు శ్రీ బాలకృష్ణ స్వయంగా మిఠాయిలు, చాక్లెట్లు పంచి పెట్టారు. తన అభిమానులతో ముచ్చటిస్తూ వారితో సెల్ఫీలు దిగారు. అదే విధంగా పేషెంట్ల బాగోగులు విచారిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here