మత్స్య రంగంలో వ‌న‌రుల సామర్థ్యం పెంపుపై ఉచిత వెబినార్‌

0
145
Spread the love

మత్స్య రంగంలో వ‌న‌రుల సామర్థ్యం పెంపుపై ఉచిత వెబినార్‌

హైద‌రాబాద్‌, జులై 10, 2021 మ‌త్య్స‌, ప‌శుసంవ‌ర్ధ‌క పాడి ప‌రిశ్ర‌మ మంత్రిత్వ శాఖ కు చెందిన మ‌త్స్య విభాగం లోని జాతీయ మ‌త్స్య అభివృద్ధి బోర్డు (ఎన్ఎఫ్‌డిబి) వారి స‌హ‌కారం తో సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల జాతీయ సంస్థ‌ (ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ) ఆధ్వ‌ర్యంలో ప్ర‌ధాన మంత్రి మ‌త్స్య సంప‌ద యోజ‌న (పిఎమ్ఎమ్ఎస్‌వై) ప‌థ‌కం కింద ఫిష‌రీస్ & అక్వా క‌ల్చ‌ర్ రంగానికి సంబంధించిన వ‌న‌రుల సామ‌ర్ధ్యాన్ని పెంచ‌డానికి ప‌లు వెబినార్‌లు నిర్వ‌హిస్తుంది. ఇందులో భాగంగా 2021 జూలై 15వ తేదీన రిటైల్ ఫిష్ మార్కెటింగ్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ డెవెల‌ప్‌మెంట్ వంటి ఫిష‌రీస్ & అక్వా క‌ల్చ‌ర్ కార్య‌క‌లాపాల‌కు సంబంధించి ప‌లు అంశం పై ఈ వెబినార్ ను ఉచితంగా నిర్వ‌హిస్తున్నారు.

మ‌త్స్య‌కారులు, మ‌త్స్య రైతులు, మ‌త్స్య రంగం లోని పారిశ్రామిక‌వేత్త‌లు, శాస్త్రవేత్త‌లు, ప్రొఫెష‌న‌ల్స్‌, అక్వారంగంపై ఆస‌క్తి ఉన్న‌వారు, మ‌త్స్య‌ రంగానికి సంబంధించిన వివిధ భాగ‌స్వామ్య ప‌క్షాల‌వారు ఈ వెబినార్ లో పాల్గొన్న‌వ‌చ్చు. ఈ ఉచిత వెబినార్ లో పాల్గొన‌ద‌ల‌చిన‌వారు www.nimsme.org ను సంద‌ర్శించ‌వ‌చ్చు, లేదా 040-23633252/225/220 కు కాల్ చేసి న‌మోదు చేసుకోవ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here