కోకాపేట భూముల వేలంలో వెయ్యి కోట్ల గోల్‌మాల్‌: రేవంత్‌రెడ్డి

0
109
Spread the love

  కోకాపేట భూముల వేలంలో వెయ్యి కోట్ల గోల్‌మాల్‌: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ జూలై 17 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: కోకాపేట భూముల వేలంలో వెయ్యి కోట్ల గోల్‌మాల్‌ అయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.పారిశ్రామికవేత్త రామేశ్వరరావు కుమారులకు భూములు కట్టబెట్టారని ఆరోపించారు. రామేశ్వరరావు కంపెనీలకు కేసీఆర్‌ వందలకోట్ల లబ్ధిచేకూర్చారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ నేతల కుటుంబాల వారే భూములు కొన్నారని, కోకాపేట భూముల వేలంలో అక్రమాలు జరిగాయని తెలిపారు. వేలంలో పాల్గొనవద్దని కొందరిని బెదిరించారని రేవంత్‌రెడ్డి చెప్పారు.‘‘సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి కూడా భూములు కొన్నారు. వెంకట్రామిరెడ్డికి చెందిన 2 కంపెనీలు తొమ్మిదిన్నర ఎకరాలు కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వెయ్యి కోట్ల నష్టం వాటిళ్లింది. ఐదుగురు కలిసి వెయ్యి కోట్లు కొల్లగొట్టారు. దేశంలోని ప్రధాన కంపెనీలను టెండర్లు వేయకుండా అడ్డుకున్నారు. భూములు అమ్ముకుంటూపోతే భవిష్యత్‌ తరాలకు ఇబ్బంది. 60 కోట్ల కంటే తక్కువ అమ్ముడుపోయిన భూముల వేలం రద్దు చేయాలి’’ అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here