తూతూ మంత్రంగా మూసీ అభివృద్ధి చర్యలు: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి 

0
72
Spread the love

తూతూ మంత్రంగా మూసీ అభివృద్ధి చర్యలు: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్ జూన్ 29 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: తూతూ మంత్రంగా మూసీ అభివృద్ధి చర్యలున్నాయని ఎంపీ, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. త్వరలో మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.  హైదరాబాద్ నగరం తెలంగాణకు గుండెకాయ అని అన్నారు. ఈ హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచితేనే ఫలితమని తెలిపారు. అన్ని రకాల ట్యాక్స్‌లు పెంచారని… 800 కోట్లతో వరద నివారణ చర్యలు చేస్తామని.. పట్టించుకోలేదని అన్నారు. నాలాలు, చెరువులు కబ్జా చేసుకున్నాక చర్యలు అంటున్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్, మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఒక మాఫియాగా ఏర్పడ్డారన్నారు. సీసీ కెమెరాలను నాలాలు, చెరువలు, కబ్జాల ప్రాంతాల్లో పెట్టమని చెప్పామని… అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మాఫియాకు అనుకూలంగా ఉండేందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం లేదని విమర్శించారు. లింగోజిగూడ కార్పొరేటర్ ప్రమాణ స్వీకరానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా  కార్పొరేటర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన రాజశేఖర్ రెడ్డికి పీసీసీ చీఫ్ శుభాకాంక్షలు తెలిపారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here