సిద్ధిపేట లో రోబోటిక్ కన్ స్ట్రక్షన్ 3డి ప్రింటర్ ను ప్రారంభించిన హరీశ్ రావు

0
119
Spread the love

 సిద్ధిపేట్ లోని చర్విత మేడోస్ లో

భారతదేశ మొట్టమొదటి అత్యాధునిక రోబోటిక్ కాంక్రీట్ 3డి ప్రింటర్

 సిద్ధిపేట లో రోబోటిక్ కన్ స్ట్రక్షన్ 3డి ప్రింటర్ ను ప్రారంభించిన

తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి టి. హరీశ్ రావు

 

అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ ను అందించే సింప్లీఫోర్జ్ క్రియేషన్స్ నే డిక్కడ ఈ తరహాలో మొట్టమొదటిదైన తమ అత్యాధునిక రోబోటిక్ కన్ స్ట్రక్షన్ 3డి ప్రింటర్ ను ప్రారంభించిం ది. భారతదేశంలో మొట్టమొదటి, దక్షిణాసియాలోనే అతిపెద్ద రోబోటిక్ కన్ స్ట్రక్షన్ 3డి ప్రింటర్ గా చెప్పదగిన ఈ ప్రింటర్ ను సిద్ధిపేట లోని చర్విత మేడోస్ లో తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి టి. హరీశ్ రావు ప్రారంభించారు. మంత్రితో పాటుగా సింప్లీఫోర్జ్ క్రియేషన్స్ వ్యవస్థాపకులు, సీఓఓ, శ్రీ అ మిత్ గులె, వ్యవస్థాపకులు, సీఈఓ ధ్రువ్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఈ యంత్రం వినూత్న అంశాలు, రోబోటిక్ ఆర్మ్ ప్రింటర్ నిర్వహించే వినూత్న నిర్మాణాల గురించి వివరించారు. 

కన్ స్ట్రక్షన్ 3డి ప్రింటింగ్ అనేది రిమోట్ కన్ స్ట్రక్షన్స్ మరియు వినూత్న డిజైన్లకు సంబంధించి భారతదేశ ప్రత్యే క గృహనిర్మాణ అవసరాలను తీర్చే సాంకేతికత. సింప్లీఫోర్జ్ క్రియేషన్స్ రోబోటిక్ ఆర్మ్ కన్ స్ట్రక్షన్ 3డి ప్రింటర్ భారతదేశంలో అతిపెద్ద రోబోటిక్ కన్ స్ట్రక్షన్ 3డి ప్రింటర్ మాత్రమే గాకుండా ఈ పరిమాణంలో దక్షిణాసియాలో మొదటిది కూడా. ఈ త్రీ డీ ప్రింటర్ ల్యాండ్ స్కేపింగ్ ఎలిమెంట్స్, ఫర్నీచర్, స్టాట్యూస్, వాల్ ఫకేడ్స్ లాంటి వాటితో సహా మరెన్నో వాటిని పూర్తి స్థాయి సివిల్ నిర్మాణాల కోసం ప్రింట్ చేయగలుగుతుంది.  ఈ ప్రింటర్ జి యో పాలిమర్స్, మట్టి లాంటి పర్యావరణ స్నేహపూర్వక మెటీరియల్స్ తో పాటుగా సింప్లీ ఫోర్జ్ ఆవిష్కరించిన ప్రొప్రైటరీ నిర్మాణ మెటీరియల్ ‘సింప్లీక్రీట్’తో కూడా పని చేస్తుంది. అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ లో వృథా చాలా తక్కువగా ఉంటుంది. సప్లయ్ చెయిన్స్ తక్కువగా ఉంటాయి. వనరుల గరిష్ఠ సద్వినియోగానికి వీలవుతుం ది. నిర్మాణ పరిశ్రమకు వికేంద్రీకృత తయారీని అందించవచ్చు. 

ఈ సందర్భంగా గౌరవనీయ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, ‘‘వినూత్నత అనేది ఎక్కడైనా జరగవచ్చు. అ ది టయర్ 1 మెట్రోసిటీలో మాత్రమే జరగాలనేం లేదు. సిద్ధిపేట వంటి చిన్న పట్టణంలోనూ జరగవచ్చు. ఈ 3 డి ప్రింటర్ అనేది అలాంటి మైలురాయి కార్యక్రమం. ఈ అత్యాధునిక సాంకేతికతను చర్విత మేడోస్ లో ప్రారం భించడం నాకెంతో ఆనందాన్ని అందిస్తోంది. ఈ గణనీయ మైలురాయి సాధించినందుకు గాను సింప్లిఫోర్జ్ యావత్ బృందానికి నా అభినందనలు. పరిశ్రమ అవసరాలను తీరుస్తూ, ఇలాంటి అధునాతన సాంకేతికత వినూత్నతలకు సిద్ధిపేటను హబ్ గా చేయాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

ఈ వినూత్న ఆవిష్కరణ పై సింప్లీఫోర్జ్ క్రియేషన్స్ వ్యవస్థాపకులు, సీఓఓ, శ్రీ అ మిత్ గులె తన ఆనందం వ్య క్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘మా ప్రాజెక్టు ను ప్రారంభించేందుకు గౌరవనీయ మంత్రి హరీశ్ రావు గారు రావడం మాకెంతో ఆనందదాయకం. ప్రస్తుత 3డి ప్రింటర్ 7 మీటర్ల పరిమాణం దాకా నిర్మా ణాలను సృష్టిస్తూ, దీన్ని యావత్ భారతదేశంలో, యావత్ దక్షిణాసియా లోనూ అతిపెద్ద రోబోటిక్ కాంక్రీట్ 3డి ప్రింటర్ గా చేసింది. అంతేగాకుండా ఈ ప్రింటర్ పరిధిని అవసరమైన మేరకు పెంచుకోవచ్చు. రోబోటిక్ కాంక్రీట్ 3డి ప్రింటర్ మెరుగైన డిజైన్ వెర్సాటిలిటీని అందిస్తుంది. డిజైనర్లకు అవసరమైన స్వేచ్ఛను అందిస్తుంది. ప్రాజె క్ట్ స్థలాల వద్ద వినియోగించుకోవడాన్ని తేలిక చేస్తుంది. ఇవన్నీ కూడా దీన్ని డిజైనర్లకు, ప్రాజెక్టు డెవలపర్లకు ఎంతో ఆకర్షణీయమైందిగా చేశాయి’’ అని అన్నారు. 

అప్సుజ  ఇన్ ఫ్రాటెక్ (చర్విత మేడోస్) ఎండీ, సీఈఓ జె హరికృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘చర్విత మేడో స్ అనేది తెలంగాణ  లోని సిద్ధిపేటలో ఈ తరహాలో నూతన తరం గేటెడ్ కమ్యూనిటీ. ప్రశాంత జీవితానికి వీలు గా సుస్థిరదాయక విధానంలో ఇది భవిష్యత్ సన్నాహన ప్రపంచంగా డిజైన్ చేయబడింది. సింప్లిఫోర్జ్ తో కలసి పని చేయడం మాకెంతో ఆనందదాయకం. వినూత్నత దిశగా ఈ ప్రయాణం మాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు.

సింప్లీఫోర్జ్ క్రియేషన్స్ వ్యవస్థాపకులు, సీఈఓ ధ్రువ్ గాంధీ ఈ సాంకేతికత గురించి మరిన్ని వివరాలను వెల్లడిం చారు. ‘‘చర్విత మేడోస్ లో మేం, దీని సంజీవని పార్క్ కు ఎన్నో కళాత్మక అంశాలను కూడా జోడిస్తున్నాం. యావత్ దేశంలోనే ఈ తరహాలోనే మొదటిదైన పార్క్ గా దాన్ని తీర్చిదిద్దుతున్నాం. చర్విత మేడోస్ డిజైన్ తా త్వికత భవిష్యత్ సన్నద్ధక సాంకేతికతలతో కూడిన సుస్థిరదాయక జీవనం. రోబోటిక్ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ  అనేది దాని పర్యావరణపూర్వక ప్రయోజనాలను, అది అందించే డిజైన్ స్వేచ్ఛను దృష్టిలో ఉంచుకొని ఎం చుకోబడింది. వినూత్న సాంకేతికతలకు ప్రాచుర్యం కల్పించడంలో ఎల్లవేళలా ముందంజలో ఉంటున్న తెలం గాణ ప్రభుత్వానికి మా అభినందనలు. ‘నేషనల్ సెంటర్ ఫర్ అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్’ ఏర్పాటుపై ప్రభు త్వం పని చేయడం ఈ సాంకేతికతను మరింత ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వానికి గల ఆసక్తిని తెలి యజేస్తోంది’’ అని అన్నారు.

భారీగా మెటీరియల్స్ లైబ్రరీతో, ఉన్నతస్థాయి డిజైన్ నైపుణ్యంతో, సాంకేతిక వినియోగాలకు అవసరమైన పరి జ్ఞానంతో సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ తన సాంకేతికతను విశ్వవ్యాప్తం చేయడాన్ని లక్ష్యంగా చేసుకుంది. కంపెనీ దేశంలో, విదేశాల్లో స్మార్ట్ నిర్మాణాలకు వీలుగా రోబోటిక్ సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. ఈ సాంకేతికత ఆర్కిటెక్ట్ లకు డిజైన్ స్వేచ్ఛను కూడా అందిస్తుంది. వినూత్న నిర్మాణాల కోసం విశిష్ట స్ట్రక్చర్స్ తో ప్రయోగాలు చేసేందుకు స్ట్రక్చరల్ ఇంజినీర్లకు అవకాశం కల్పిస్తుంది.

సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ గురించి:

సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ అనేది టెక్నాలజీ డెవలప్ మెంట్, సిస్టమ్ ఇంటిగ్రేషన్, సర్వీస్ సొల్యూషన్ సామర్థ్యాలు కలిగిన అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ కంపెనీ. ఎఫ్ఎంసీజీ రంగం మొదలుకొని ప్రొటొటైపింగ్, ప్రొ స్తెటిక్స్, జ్యువెలరీ, మెడికల్ ఉపకరణాలు వంటి ఉన్నత రంగాలకు కూడా సంపూర్ణ ప్రొటొటైపింగ్, మాన్యుఫ్యా క్చరింగ్ పరిష్కారాలను ఇది అందిస్తుంది. నిర్మాణ రంగానికి ఇది సాంకేతికత, మెటీరియల్స్ డెవలప్ మెంట్, ఎక్విప్ మెంట్ తయారీ, ఇంటిగ్రేషన్, ఎండ్ టు ఎండ్ కన్ స్ట్రక్షన్ సొల్యూషన్స్ ను అందిస్తుంది. తయారీ రంగ నిపుణులు, స్థానిక ఉత్పత్తి కేంద్రాలు, అంతర్జాతీయ డిజైన్ నిపుణులతో కూడిన సింప్లిఫోర్జ్ వివిధ రంగాల్లో తన సేవలను అందిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here