నిలిచిపోయిన 2000 వేల రూపాయల నోట్ల ముద్రణ!      

0
114
Spread the love

నిలిచిపోయిన 2000 వేల రూపాయల నోట్ల ముద్రణ!      

   తగ్గిన చలామణి ..ఇక నోట్ల రద్దు తప్పదా?

న్యూ డిల్లీ మే 29 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );మోడీ ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన కొత్త రూ. 2000 వేల రూపాయల నోట్ల పై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇకపై రూ. 2000 వేల రూపాయల నోటును ముద్రించబోమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2020-21లోనూ కొత్తగా రెండువేల నోట్లు ముద్రించలేదని వెల్లడించింది. 2021 ఆర్ధిక సంవత్సరంలో మొత్తంగా కరెన్సీ నోట్ల ముద్రణ 0.3 శాతం మేర తగ్గి 223301 లక్షల నోట్లుగా ఉన్నాయి. అదే అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 223875 లక్షలు.రూ.500 నోటు రూ.2000 నోట్లు ఆర్ధికవ్యవస్థలో చెలామణిలో ఉన్న నోట్లలో అత్యధిక కరెన్సీ విలువను కలిగి ఉన్నాయి. చెలామణిలో ఉన్న బ్యాంక్ నోట్ల విలువలో వీటి విలువ 85.7 శాతం. గత ఏడాది 83.4 శాతంతో పోలిస్తే కొంచెం ఎక్కువ. నోట్ల ముద్రణ పరంగా చెలామణిలో ఉన్న అన్ని బ్యాంక్ నోట్లలో రూ.500 నోట్ల సంఖ్యే 31.1 శాతం. ఆర్ బీఐ గత సంవత్సరం వార్షిక నివేదికలో భద్రతా సమస్యల కారణంగా తాత్కాలికంగా రూ.2000 నోటు ముద్రణను నిలిపివేసినట్లు తెలిపింది. 2018 నుంచి వ్యవస్థలో రూ.2000 నోట్లు తగ్గుతూ వస్తున్నాయి. ఆర్ బీఐ గత సంవత్సరం వార్షిక నివేదికలో భద్రతా సమస్యల కారణంగా తాత్కాలికంగా రెండువేల నోటు ముద్రణ నిలిపివేసినట్టు తెలిపింది. 2018 నుంచి వ్యవస్థలో 2వేల కరెన్సీ నోట్లు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ఆర్ బీఐ రెండువేల నోటును రద్దు చేయకుండా క్రమ క్రమంగా ముద్రణను నిలిపివేస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేసేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం పాత రూ.500 నోటు పాత రూ.1000 నోటును రద్దు చేసిన విషయం తెలిసిందే. పాత రూ.1000 నోటు స్థానంలో రూ.2000 నోట్లను చెలామణిలోకి తీసుకొచ్చింది. ఆర్బీఐ రూ.2000 నోటును రద్దు చేయకుండా క్రమ క్రమంగా ముద్రణను నిలిపివేస్తుందా అనే మరో వాదన కూడా ఉంది. ఏది ఏమైనా కొత్త నోట్ల ముద్రణ ఆగిపోయిందని మాత్రం ఆర్ బీఐ స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here