ఆగ‌ని యుద్ధం … మే వ‌ర‌కు కొన‌సాగే అవ‌కాశం..!

0
73
Spread the love

ఆగ‌ని యుద్ధం … మే వ‌ర‌కు కొన‌సాగే అవ‌కాశం..!

యుద్ధం మొద‌లైనప్ప‌టి నుంచి 13,500 మంది ర‌ష్య సైనికుల‌ను చంపిన‌ట్లు ఉక్రెయిన్ ప్ర‌క‌టించింది. వంద‌ల సంఖ్య‌లో సాయుధ వాహ‌నాల‌ను కూడా ధ్వంసం చేసిన‌ట్లు తెలిపింది. మ‌రో వైపు దాడులు నింకా కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయి. మూడు దేశాల‌కు చెందిన ప్ర‌తినిధులు ఉక్రెయిన్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. ఐరోపా దేశాల సంపూర్ణ మ‌ద్ద‌తు పొందేందుకు స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. కొన్ని దేశాలు ర‌ష్యా హిప్న‌టైజ్ కు గురయ్యాయ‌ని ఉక్రెయిన్ అధినేత జ‌ల‌న్ స్కీ పేర్కొంటున్నారు. ర‌ష్య అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్య‌క్షుడు బైడెన్‌కు మ‌రో జ‌ల‌క్ ఇచ్చారు. బైడెన్‌తో పాటు మ‌రో 12 మంది ర‌ష్యాలోకి అడుగెపెట్ట‌వ‌ద్దంటూ… ఆదేశాలు జారీ చేశారు. ర‌ష్యా నిరంత‌రాయంగా దాడులు చేస్తుండ‌డంతో ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌లో 36 గంట‌ల క‌ర్ఫ్యూ విధించారు. దేశ వ్యాప్తంగా దాడులు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అధికారులు ప్ర‌క‌టించ‌డంతో బెంబేలెత్తిపోయిన జ‌నం బంక్స్‌లోకి చేరిపోయారు. బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్‌జాన్స‌న్ ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అన్ని ర‌కాలుగా అండ‌దండ‌లు క‌ల్పిస్తామ‌ని చెప్పారు. మ‌రో వైపు ముడిచ‌మురు, స‌హ‌జ వాయువు దిగుమ‌తుల విష‌యంలో ర‌ష్యాపై ఆధార‌ప‌డ‌డం త‌గ్గించుకోవాల‌ని యూరేపియ‌న్ దేశాలను ఆయ‌న కోరారు. యుక్రెయిన్‌తో యుద్ధం కొనుసాగుతున్న నేప‌థ్యంలో ర‌ష్యాపై బ్రిట‌న్ మ‌రిన్ని ఆంక్ష‌లు విధించింది. ఈ యుద్ధం మే వ‌ర‌కు కొన‌సాగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here