సైబరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి – కేక్ క‌ట్ చేసిన స‌జ్జ‌నార్

0
335
Spread the love


హైదరాబాద్, మార్చి 14: సైబరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సీపీ సిబ్బందితో కలిసి సైబరాబాద్ కమిషనరేట్ లో గురువారం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలీసులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. స్టేషన్ కు వచ్చే వారి పట్ల మర్యాదగా ప్రవర్తించాలన్నారు. పోలీసులంటే ప్రజలకు విశ్వాసం పెరిగేలా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్, శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, మాదాపూర్ డి‌సి‌పి వేంకటేశ్వర రావు, బాలానగర్ డీసీపీ పద్మజ, ఏడీసీపీ ఎస్బీ గౌస్ మొహియుద్దీన్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

 సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు మాస్కుల అందజేత…సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., సూచనల ప్రకారం సైబరాబాద్ లోని అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల సిబ్బందికి సంబంధిత ఏసీపీల ద్వారా పొల్యూషన్ మాస్కులను అందజేశారు. ట్రాఫిక్ పోలీసులు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలని సైబరాబాద్ సీపీ అన్నారు. ఎక్కువ సమయం రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్నందున తప్పనిసరిగా మాస్కులను ధరించాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here