
సకల జన సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు
సకల జన సేవా సంస్థాన్ కార్యాలయంలో హోలి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. హోలి సంబురాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అధ్యక్షుడు జి.ఎస్.కుమారస్వామితో పాటు ఇతర నేతలకు రంగులు పూసి…. మిఠాయిలు పంచారు. హైదరాబాద్ నగరంలోని బషీర్బాగ్లో జరిగిన ఈ వేడుకల సంబురాలు అంబరానంటాయి. ఈ సందర్భంగా సకల జన సేవా సంస్థాన్ అధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ….. రానున్న కాలంలో మహిళలే రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో మరింత దూసుకుపోతారని ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థాన్ కార్యాలయానికి ఇంత పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి ఇక్కడ హోలి వేడుకలు జరపడం ఆనందంగా ఉందన్నారు. ఆడవాళ్ళకు గౌరవం ఉన్నచోట దేవతలు విహరిస్తారు అని చెప్పారు. ఎప్పటి నుంచో మన దేశంలో మహిళకే అగ్రస్థానం ఉంది. అంతేకాదు ఇంటి పెత్తనం ఆమెది. అన్ని విషయాలలో ఆమె మాటే వేదం. లేక పోతే మగవాళ్ల పని ఎప్పుడో అయిపోయేది అని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో భవిష్యత్తులో మరింత మంది మహిళలు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్ జైన్, గడ్డం ఎబుల్, సయ్యద్ మతీమ్, టి.బాబు, లక్ష్మీ, ఎన్.ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
Read This News Also…. Click the Link Below
రుణం ఇలా పొందండి..! సమాంతర కో – ఆపరేటివ్ సొసైటీ… లోన్ అవగాహన కార్యక్రమం