కుల మ‌తాల బేధ భావాలు పోయి…. అంద‌రం ఒక్క‌టేనన్నభావ‌న రావాలి – వేణు మాధ‌వ్ శ‌ర్మ

0
235
Spread the love

కుల మ‌తాల బేధ భావాలు పోయి…. అంద‌రం ఒక్క‌టేనన్నభావ‌న రావాలి – వేణు మాధ‌వ్ శ‌ర్మ

Toofan Hyderabad – కుల మ‌తాల బేధ భావాలు పోయి…. అంద‌రం ఒక్క‌టేనన్న సుహృద్భావ‌న వాతావ‌ర‌ణం రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని సికింద్రాబాద్ మ‌హంకాళి దేవ‌స్థానం ప్ర‌ధాన అర్చ‌కులు… ఆస్థాన శ్రీ విద్యా పండితులు బ్ర‌హ్మ‌‌శ్రీ ఆర్ వేణు మాధ‌వ్ శ‌ర్మ పేర్కొన్నారు. ”ప్ర‌జాస్వామ్యాన్ని మ‌రింత ప‌టిష్టం చేయ‌డంలో మ‌న పాత్ర” అన్న అంశంపై స‌క‌ల జ‌న సేవా సంస్థాన్ అధ్య‌క్షుడు జి.ఎస్.కుమార‌స్వామి ఆధ్వ‌ర్యంలో బ‌షీర్‌బాగ్ కార్యాల‌యంలో జ‌రిగిన స‌దస్సులో బ్ర‌హ్మ‌శ్రీ‌ వేణు మాధ‌వ శ‌ర్మ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మాధ‌వ శ‌ర్మ‌ను సంస్థాన్ స‌భ్యులంద‌రూ క‌లిసి పూల‌మాల వేసి శాలువా క‌ప్పి స‌త్క‌రించారు. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మ‌రో అతిధి ఓబీసీ సెంట్ర‌ల్ క‌మిటీ ఛైర్ ప‌ర్స‌న్ భాగ్య‌ల‌క్ష్మిని కూడా సంస్థాన్ మ‌హిళ‌లు స‌న్మానించారు. ఉద్యోగం రాలేద‌న్న భావోద్వేగంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్న సునీల్ నాయ‌క్‌ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటూ…. స‌భికులు కొద్ది స‌మ‌యం మౌనం పాటించారు. ముఖ్య వ‌క్త వేణు మాధ‌వ శ‌ర్మ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ…. స‌ర్వేజ‌నా సుఖినోభ‌వంతు అన్న వేద అర్థానికి త‌గ్గ‌ట్టుగానే స‌క‌ల జ‌న సేవా సంస్థాన్ పేరు ఉండ‌డం శుభ‌సూచ‌క‌మ‌న్నారు. సంస్థాన్ అధ్య‌క్షుడు కుమార‌స్వామి… అంద‌రూ బాగుండాల‌న్న ఆకాంక్ష‌తో సంస్థ‌ను న‌డుపుతుండ‌డం ముదావ‌హ‌మ‌న్నారు. రాముడి కాలంలో ధ‌ర్మం బాగాన‌డిచింది….ప్ర‌కృతి స‌మ‌తుల్యంతో తుల‌తూగింది…. అప్ప‌టి కాలం నాటి స‌మ‌తాభావ‌నాలు నేటికాలానికి కూడా రావాల‌ని ఆయన ఆకాంక్షించారు. స‌మ‌స‌మాజ స్థాప‌న కోసం కుమార‌స్వామి చేస్తున్న కృషి ఎన‌లేనిద‌న్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని మ‌రింత ప‌టిష్టం చేసే ల‌క్ష్యంతో మ‌రిన్ని కార్య‌క్ర‌మాల‌ను భ‌విష్య‌త్తులో నిర్వ‌హించున్న‌ట్లు స‌క‌ల జ‌న సేవా సంస్థాన్ అధ్య‌క్షుడు కుమార‌స్వామి పేర్కొన్నారు. ఓబీసీ సెంట్ర‌ల్ క‌మిటీ ఛైర్ ప‌ర్స‌న్ భాగ్య‌ల‌క్ష్మి మాట్లాడుతూ..విలువైన ఉద్యోగం ఉన్న‌ప్ప‌టికీ… ప్ర‌జాలంద‌రినీ మ‌మేకం చేసే ల‌క్ష్యంతో కుమార‌స్వామి ప‌నిచేస్తుండ‌డం ఎంతో స్పూర్తిదాయ‌క‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సంస్థాన్ ప్ర‌తినిధులు ఎ.శ్రీ‌మ‌న్నారాయ‌ణ‌, జె.న‌ర్సింగ్‌రావు, స‌య్య‌ద్ మ‌తీన్ అహ్మ‌ద్‌, ఎం.ల‌క్ష్మీ, టి.బాబు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here