*వాడ‌వాడ‌న న‌మూనా పోలింగ్ – ఈవీఎం, వివిప్యాట్‌ల అవ‌గాహ‌న‌కు విశేష స్పంద‌న‌*

0
311
Spread the love

*వాడ‌వాడ‌న న‌మూనా పోలింగ్ – ఈవీఎం, వివిప్యాట్‌ల అవ‌గాహ‌న‌కు విశేష స్పంద‌న‌*

తాము వేసిన ఓటు…స‌రిగానే త‌న అభ్య‌ర్థికే ప‌డిందా? ఇత‌ర అభ్య‌ర్థికి ప‌డిందా? త‌దిత‌ర సందేహాల‌ను తీర్చ‌డానికి హైద‌రాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఈవీఎం, వివిప్యాట్‌ల అవ‌గాహ‌న కేంద్రాల ద్వారా న‌గ‌ర ఓటర్లు త‌మ సందేహాల‌ను నివృత్తి చేసుకుంటున్నారు. ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప‌నితీరు, ఈసారి కొత్త‌గా ఏర్పాటు చేసిన ఓట‌ర్ వెరిఫేయ‌బుల్ పేప‌ర్ ఆడిట్ ట్ర‌య‌ల్ (వివిప్యాట్‌)ల‌పై ఓట‌రుకు సందేహాల‌ను తీర్చ‌డంతో పాటు, స్వ‌యంగా న‌మూనా పోలింగ్‌లో పాల్గొన‌డానికి జిల్లా ఎన్నిక‌ల అధికారి దాన‌కిషోర్ హైద‌రాబాద్ జిల్లాలో 48 స్టాటిక్ కేంద్రాల 3 మొబైల్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఈ న‌మునా పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్య‌లో హాజ‌రైన వారితో జీహెచ్ఎంసీ అధికారులు మాక్ పోలింగ్ నిర్వ‌హిస్తున్నారు. స్థానికులు, మ‌హిళా సంఘాల ప్ర‌తినిధులు, నాయ‌కుల‌తో ఈవీఎంల‌లో ఓటు వేయించి త‌మ ఓటు స‌రిగా ప‌డిందా లేదా? అనే విష‌యాన్ని స్ప‌ష్టంగా తెలుసుకునేందుకు వివిప్యాట్‌ల ద్వారా చైత‌న్యం క‌ల్పిస్తున్నారు. ప్ర‌తి ఓట‌రు ఈవీఎంల‌తో పాటు వివిప్యాట్‌ల ప‌నితీరును స్వ‌యంగా తెలుసుకోవ‌డానికి ఈ కేంద్రాల‌ను ఉద‌యం 10 గంట‌ల నుండి సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు అందుబాటులో ఉంచ‌డానికి ఏర్పాటు చేశారు.
*ఓటును వేసే విధానం ఇలా…*
ఓట‌రు పోలింగ్ కంపార్ట్‌మెంట్‌కు వెళ్లేస‌రికి ప్రిసైడింగ్ అధికారి బ్యాలెట్‌ను సిద్దంగా ఉంచుతారు. బ్యాలెట్ పై యూనిట్‌పైన న‌చ్చిన అభ్య‌ర్థి పేరు లేదా గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు (బ్లూ) బ‌ట‌న్‌ను గ‌ట్టిగా నొక్కాలి. ఓటు వేసిన అనంత‌రం ఓట‌రు ఎంచుకున్న అభ్య‌ర్థి పేరు/ గుర్తుకు ఎదురుగా ఎర్ర లైట్ వెలుగుతుంది. అనంత‌రం ప్ర‌క్క‌నే ఉన్న వివి ప్యాట్ పై మీరు ఎన్నుకున్న అభ్య‌ర్థి, సీరియ‌ల్ నెంబ‌ర్ పేరు గుర్తుతో ఒక బాలెట్ స్లిప్‌ను ప్రింట్ చేసి చూపిస్తుంది. ఈ బ్యాలెట్ స్లిప్ 7 సెకండ్ల పాటు క‌నిపించి, ఆ త‌ర్వాత క‌ట్ అయి ప్రింట‌ర్ యొక్క డ్రిప్ బాక్స్‌లో ప‌డుతుంది. ఆ వెంట‌నే చీప్ శ‌బ్దం వినిపిస్తుంది. అయితే, ప్రింట‌వుట్ కాగితాన్ని ఓట‌రు చేతికి ఇవ్వ‌రు. కేవ‌లం ప్రింట్‌ను గ్లాస్ ద్వారా మాత్ర‌మే చూడ‌వ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here