ఓటు వేయాలంటూ విస్తృత ప్రచారం చేసిన సంస్కృతి ఫౌండేషన్

0
551
Spread the love

ఓటు హక్కును తప్పకుండా ఉపయోగించుకోవాలంటూ సంస్కృతి ఫౌండేషన్ విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి ఓటుపై చైతన్యం కలిగించింది. ప్రధానంగా వీరు ఆయా జిల్లాల్లోని ఇంజినీరు కాలేజీలకు వెళ్లి మరీ ఓటు కొత్తగా వచ్చిన వారిని జాగృత పరిచారు. ఓటు తప్పకుండా వినియోగించుకోవాలని వారికి సూచించారు.  ” ఓటు వేసే వాళ్లు  మీరు భారతీయులై ఉండాలి. మీకు 18 ఏళ్ల వయస్సు నిండాలి. ఓటర్ల జాబితాలో మీ పేరు ఉండాలి.ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. లేదా స్థానిక ఎన్నికల కార్యాలయానికి వెళ్లి పరిశీలించవచ్చు. పోలింగ్ బూత్‌కు వెళ్లేప్పుడు ఓటరు ఐడీ లేదా ఇతర గుర్తింపు కార్డులు తీసుకెళ్లండి. ఓటరు స్లిప్ కూడా తీసుకెళ్లండి. ఓటరు స్లీప్ ఇంటికి వచ్చి ఇస్తారు. స్లీప్ లేకపోయినా ఆందోళన చెందవద్దు. పోలింగ్ బూత్‌లోని రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే కౌంటర్లలో ఏజెంట్స్ వద్ద స్లిప్ పొందవచ్చు. పోలింగ్ బూత్‌కు చేరగానే క్యూలో నిలుచుని ఓటర్ స్లిప్, ఐడీలు సిద్ధంగా ఉంచుకోవాలి.పోలింగ్ అధికారి ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో పరిశీలిస్తారు. మీ పేరు ఉందని నిర్ధారించుకున్నాక మరో అధికారి మీ వేలికి సిరా అంటిస్తారు.ఆ తర్వాత ఓ చీటీ ఇస్తారు. ఇంకో అధికారి ఆ చీటిని పరిశీలించి ఓటింగ్‌కు అనుమతి ఇస్తారు. ఓటు వేయడానికి ఉపయోగించే ఈవీఎం మీద అభ్యర్థులు, వారి పార్టీ గుర్తులు ఉంటాయి.వాటిలో మీకు నచ్చిన పార్టీ లేదా అభ్యర్థి ఎంపిక చేసుకుని.. వారి గుర్తు పక్కన ఉండే మీట నొక్కండి. అనంతరం వీవీప్యాట్ వద్దకు వెళ్లండి.అందులో మీరు ఎవరు వేశారో తెలిపే స్లిప్ వస్తుంది. అది ఏడు సెకన్లు కనిపించి, బాక్సులో పడిపోతుంది. అంతటితో మీరు ఓటు వేయడం పూర్తవుతుంది. మీరు ఓటేసిన పార్టీ, వీవీప్యాట్ స్లిప్‌లో కనిపించిన పార్టీ వేర్వేరుగా ఉంటే బూత్ అధికారులకు ఫిర్యాదు చేయాలి.” అంటూ వారు విస్తృతంగా ప్రచారం కొనసాగించారు. తెలంగాణలోని కరీనంగర్ శాతవాహన, పాలమూరు విశ్వవిద్యాలయం, జె.ఎన్.టి.యు. పరిధిలోని మూడు కాలేజీలు, కాకతీయ పరిధిలో మూడు కాలేజీలు, తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులను కలిసి సదస్సులు నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here