వేల్స్ రాజ‌ధానిలో ఘ‌నంగా తెలుగువారి సంక్రాంతి సంబురాలు

0
413
Spread the love

వేల్స్ రాజ‌ధానిలో ఘ‌నంగా తెలుగువారు సంక్రాంతి సంబురాలు

కార్డిఫ్ (వేల్స్ – యునైటెడ్ కింగ్డమ్) : తెలుగు అసోసియేషన్ అఫ్ వేల్స్ మొదటి వార్డికోత్సవిం మరియు సంక్రాతి సంబరాలు వేల్స్ రాజధాని అయిన కార్డిఫ్ నగరం లో అంగరంగ వైభవం గా జరిగాయి.కార్యక్రమానికి వేల్స్ మరియు ఇంగ్లాండ్ నలుమూలల నుండి తెలుగు కుటుంబాలు చాలా ఉత్సాహం గా హాజరు అయ్యారు.

కార్యక్రమం ముందుగా UK తెలుగు వర్గాల్లో ప్రమఖ వ్యక్తి అయిన శ్రీ వెలగపూడి బాపూజీ రావు గారు జ్యోతి ని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ బాపూజీ రావు గారు మాట్లాడుతూ, మన తెలుగు వారు ఐకమత్యం మరియు స్ఫూర్తి ఇలాగే ఎప్పుడు కొనసాగాలని ఆకాంక్షించారు.

తెలుగు అసోసియేషన్ అఫ్ వేల్స్ మొదటి సంవత్సరం లో చేసిన వివిధ కారయక్రమాలను .. ముఖ్యం గా బాల దినోత్సవం, మహిళా దినోత్సవం, సంక్రాతి , బోనాల జాతార వంటి కారయక్రమాల్ని గుర్తు చేసుకుని అభనందించారు. మరీ ముఖ్యం గా తెలుగు భాషాభివృద్ధి కై సంఘ సభ్యులు చేపట్టిన తెలుగు బడి కార్యక్రమాన్నీ వేనోళ్ళ పొగడారు. ఈ సందర్భం గా తెలుగు అసోసియేషన్ సభ్యులను ఘనం గా సత్కరించారు.

అనంతరం సంక్రాతి సంబరాలు అంబరాన్ని అంటాయి. మహిళలు ముగ్గుల పోటీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసే కార్యక్రమం లో పిల్లల కేరింతలు అందరినీ ఆనందపరిచింది.

ఈ సందర్భం గా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యం గా మహిళలు పాడిన తెలుగు సోదరా పాట, పిల్లల సంగీత మరియు నృత్య ప్రదర్శనలు, మంచి సందేశం తో చేసిన స్కిట్స్ వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి.

పిల్లలందరూ చెప్పిన “మేము భారతీయులం … తెలుగు వాళ్ళం” అని చెప్పిన తీరు చూసి అందరు గర్వం తో ఉప్పొంగారు.

తెలుగు అసోసియేషన్ అఫ్ వేల్స్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు భోజనం అందరికీ సొంత ఊరిని ఇంటిని గుర్తుకు తెచ్చింది. ప్రత్యేకం గా తయారు చేసిన పిండి వంటలు , పచ్చళ్ళు మరియు స్వీట్స్ ని వచ్చిన ప్రతీ ఒక్కరు సంతోషం గా ఆరగించారు.

చివరగా సంఘ సభ్యులు మాట్లాడుతూ, తెలుగు అసోసియేషన్ అఫ్ వేల్స్ ఇదే స్ఫూర్తి తో అందరి సహాయ సహాకారాలతో ఇలానే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరినీ మన్ననలు పొందేందుకు కృషి చేస్తుందని చెప్పారు.

ప్రతి ఒక్క తెలుగు కుటుంభం సంక్రాతి ని సొంత గడ్డ మీద జరుపుకోలోదనే బాధని మరచి చాలా సంతోషం గా వారి వారి స్వస్థలాలకు తిరుగు పయనం అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here