Spread the love
కరోనా పంజా.. తెలంగాణలో మళ్లీ స్కూల్స్ మూసివేత.. ఆ తరగతులకు వారికి ?
తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం.. అందులోనూ పలువురు స్కూల్ విద్యార్థులు కరోనా బారిన పడుతుండటంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. స్కూళ్లు, సంక్షేమ హాస్టల్స్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో దీనిపై విద్యాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది.
ఈ నేపథ్యంలో 8వ తరగతి వరకు స్కూళ్లను మూసివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
1-8 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇక కొన్ని రోజులుగా తెలంగాణలో కొత్త కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు మంచిర్యాల జిల్లాలోని హాస్టల్స్ విద్యార్థులకు కరోనా సోకింది. ఏకంగా 104 మంది విద్యార్థులకు కరోనా సోకినట్టు నిర్థారణ అయ్యింది. దీంతో ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.