ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15 నుంచి పాఠశాలల ప్రారంభం

0
144
Spread the love

ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15 నుంచి పాఠశాలల ప్రారంభం

తాడేపల్లి జూలై 7 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: ఆగష్టులోపు విద్యాసంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి కావాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈనెల 15 నుంచి ఆగస్టు 15వరకు వర్క్‌బుక్స్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. నాడు-నేడు కింద పనుల కోసం రూ.16 వేల కోట్లతో బడ్జెట్ సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు. నాడు నేడు, జగనన్న విద్యా కానుకపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఆగష్టు 15 తర్వాత పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆగష్టు 15 లోపు టీచర్లకు వ్యాక్సినేషన్‌ వేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆగష్టులోనే విద్యా కానుక, నాడు-నేడు రెండో విడత పనులు ప్రారంభం కావాలన్నారు. తొలివిడత పనులు పూర్తైన పాఠశాలలను ప్రజలకు అంకితం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. 

నూతన విద్యా విధానంపై సమీక్ష

నూతన విద్యా విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, విద్యావంతులైన నైపుణ్యం గల టీచర్లతో బోధన అందించాలని తెలదిపారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లు ఉండాలన్నారు. ఈ లక్ష్యాల కోసమే నూతన విద్యా విధానం అమలు చేస్తున్నామన్నారు. ఒక్క స్కూల్‌ మూసివేయకూడదని, ఒక్క టీచర్‌నూ తొలగించకూడదని ఆదేశించారు. నూతన విద్యా విధానం ప్రతిపాదనలను ఈ వారంలో ఖరారు చేయాలన్నారు. నాడు-నేడు పనులను యథావిధిగా కొనసాగించాలనిషెడ్యూల్‌ ప్రకారం పనులు పూర్తికావాలని అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here