స‌న‌త్‌న‌గ‌ర్‌లో త్రిముఖ పోటీ…ఎవ‌రి ధీమా వారిదే

0
30
Spread the love

 

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో అత్యంత కీల‌క‌మైన స‌న‌త్‌న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో త్రిముఖ పోటీలో అభ్య‌ర్థుల న‌డుమ పోటీ నువ్వా నేనా అన్న‌ట్లు సాగ‌నుంది. ఇక్క‌డి నుండి రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ టీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా రంగంలో ఉన్నారు. టీడీపీ నుండి కూన వెంక‌టేష్ గౌడ్‌, బీజేపీ త‌ర‌పున భ‌వ‌ర్‌లాల్ వ‌ర్మ పోటీ చేస్తున్నారు. ఇన్నాళ్లూ టీడీపీతో పొత్తు కార‌ణంగా పోటీకి దూరం ఉంటూ వ‌చ్చిన బీజేపీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డంతో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారిపోయింది.

స‌న‌త్‌న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ, కాంగ్రెస్‌ల బ‌లాబ‌లాలు ఇంచుమించు స‌మానంగా ఉన్నాయి. బీజేపీకి కూడా ఇక్క‌డ బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. టీఆర్ ఎస్ పెద్ద‌గా బ‌లం లేక‌పోవ‌డం వ‌ల్ల ఓట‌మి పాలైంది. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ మ‌ద్ద‌తుతో టీడీపీ అభ్య‌ర్థిగా త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ విజ‌యం సాధించి టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం లో మంత్రిగా చేరారు. అస్స‌టి ఎన్నిక‌ల్లో ల‌క్షా 24వేల 746 ఓట్లు పోల‌య్యాయి. ఇందులో టీడీపీ- బీజేపీ కూట‌మికి 56వేల‌475 ఓట్లు వ‌చ్చాయి. టీఆర్ ఎస్ కు 29,014 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డికి 23వేల 820 ఓట్లు పోల‌య్యాయి. ఈ ఎన్ఇన‌క‌ల్లో టీడీపీ-బీజేపీ త‌ర‌పున పోటీ చేసిన త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌కు 27వేల‌461 ఓట్ల మెజారిటీ చేకూరింది.

ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా కూన వెంక‌టేష్ గౌడ్ రంగంలో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌ల‌సాని కార‌ణంగా వెంక‌టేష్ గౌడ్ సికింద్రాబాద్ నుండి పోటీచేసి ఓడిపోయారు. ప్ర‌స్తుతం మ‌హాకూట‌మి అభ్య‌ర్థిగా స‌న‌త్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో సీమాంధ్ర సెటిల‌ర్స్ ఓట్లు టీడీపీకి ప‌డే అవ‌కాశాలు ఎకు్క‌వ‌గా ఉన్నాయి. సీమాంధ్రులూ తెలంగాణ బిడ్డ‌లే అని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏ మేర‌కు ప‌ని చేస్తుందో. . అట్లాగే మాజీ మంత్రి శ్రీప‌తి రాజేశ్వ‌ర్ మ‌ర‌ణానంత‌రం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి పెద్ద దిక్కుగా కొన‌సాగుతూ పార్టీని కాపాడుతూ వ‌స్తున్నారు. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన వెంక‌టేష్ గౌడ్‌కు ఆ వ‌ర్గాల మ‌ద్ద‌తూ ఉంటుదంటున్నారు.
.
నియోజ‌క‌వ‌ర్గంలో డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పేరిట పేద‌లు రోడ్డు పాల‌య్యారు. అభివృద్ధి ప‌నులు నామ‌మాత్రంగా జ‌రిగాయి. ప్ర‌భుత్వ ప‌నితీరు ప‌ట్ల ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం అవుతుంది. టీడీపీ అభ్య‌ర్థిగా త‌ల‌సానిని గెలిపిస్తే అత‌ను టీఆర్ ఎస్‌లో చేర‌డం ప‌ట్ల ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. స్థానికుడ‌నైన త‌న‌ను గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారంటున్నారు వెంక‌టేష్ గౌడ్ .

వాయిస్ః మ‌రోవైపు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు.. డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం..నియోజ‌క‌వ‌ర్గంలో 20 ఏళ్ల లో జ‌ర‌గ‌ని అభివృద్ధి త‌న విజ‌యానికి తోడ్ప‌డుతాయ‌ని త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అంటున్నారు. మ‌హాకూట‌మిని మాయాకూట‌మిగా అభివ‌ర్ణించారు. అయితే 2014 ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ ఓడిపోయినా ఆ త‌రువాత జ‌రిగిన జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో అన్ని డివిజ‌న్ల‌నూ టీఆర్ ఎస్ ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం టీఆర్ెస్ బ‌లం పెరిగిన‌ట్లే క‌నిపిస్తోంది. టీడీపీ- కాంగ్రెస్ పొత్తును ప్ర‌జ‌లు హ‌ర్షించే ప‌రిస్థితి లేదంటున్నారు త‌ల‌సాని. ఓ హిందుత్వ పార్టీగా కొన‌సాగుతున్న‌ బీజేపీకి స్థానికంగా బ‌లంలేదంటున్నారు.

వాయిస్ః మ‌రోవైపు గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి గెలుపుకు తోడ్ప‌డిన బీజేపీ ఈసారి ఒంట‌రి పోరు కార‌ణంగా భ‌వ‌ర్‌లాల్ వ‌ర్మ‌ను రంగంలోకి దింపింది. ఇక్క‌డ భ‌వ‌ర్‌లాల్ వ‌ర్మ వ‌ర్గానికి చెందిన రాజ‌స్థాన్ మార్వాడీలు.. గుజ‌రాతీలు ఎక్కువ‌గా ఉన్నారు. అట్లాగే బీజేపీ బ‌లమూ చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. దీనికితోడు మెజారిటీ స్థానాల‌ను గెలుచుకోవాల‌ని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. దానికి అనుగుణంగా ప్ర‌ధాని మోడీ, పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తోపాటు.. కేంద్ర మంత్రులు..రాష్ట్రంలో ప్ర‌చారం చేయ‌నున్న నేప‌థ్యంలో బీజేపీ బ‌లం పెరిగే అవ‌కాశం ఉంది.

ఏమైన‌ప్ప‌టికీ చాలా ఏళ్ల త‌రువాత బీజేపీ పోటీలోకి దిగ‌డంతో త్రిముఖ పోటీ ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నుంది. ఈ పోటీలో ప్ర‌జ‌లు ఎవ‌రిని గెలిపిస్తారో…డిసెంబ‌ర్ 7న తేల‌నుంది.

Watch Video

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here