భ‌ద్ర‌త‌గా ఉన్న గార్డే జడ్జి కుటుంబంపై కాల్పులు

0
435
Spread the love

భ‌ద్ర‌త‌గా ఉన్న గార్డే జడ్జి కుటుంబంపై కాల్పులు

హ‌ర్యానాలో జ‌డ్జి కుటుంబంపై కాల్పులు తీవ్ర క‌ల‌క‌లం రేపాయి. న్యాయ‌మూర్తికి ర‌క్ష‌ణ‌గా ఏర్పాటు చేసిన గార్డే ఆయ‌న‌ భార్య‌, కొడుకుపై కాల్పులు జ‌రిపాడు. హ‌ర్య‌నాలోని గురుగ్రామ్ న్యాయ‌మూర్తిగా ఉన్న కృష్ణ‌కాంత్‌కు సెక్యూరిటీగా మ‌హిపాల్ సింగ్ ప‌నిచేస్తున్నాడు. జ‌డ్జి భార్య‌, కొడుకు సెక్టార్ 49 రోడ్డులో షాపింగ్‌కు వ‌చ్చారు. వారితో పాటు ఉన్న గార్డు వారిద్ద‌రిపై రోడ్డుపై అంద‌రూ జ‌నం చూస్తుండ‌గా కాల్పులు జ‌రిపారు. రోడ్డుపై ప‌డిపోయి ఉన్న జ‌డ్జి కొడుకును కారులోకి ఎక్కించేందుకు విఫ‌ల‌య‌త్నం చేసి అక్క‌డి నుంచి పారిపోయాడు. అక్క‌డి స‌మీపంలోని ఒక పోలీసు స్టేష‌న్ వ‌ద్ద కూడా కాల్పులు జ‌రిపాడు. అత‌న్ని ఫ‌రీదాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. గాయ‌ప‌డిన బ‌డ్జి భార్య కోలుకుంటుండ‌గా ఆయ‌న కుమారున ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here