వదంతులు నమ్మవద్దు.. నేను ఆరోగ్యంగానే ఉన్నా: నటుడు చంద్రమోహన్‌.

0
174
Spread the love

వదంతులు నమ్మవద్దు.. నేను ఆరోగ్యంగానే ఉన్నా: నటుడు చంద్రమోహన్‌.

హైదరాబాద్ మే 25 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );ఆదివారంతో 80 వసంతాలు పూర్తి చేసుకుని 81వ వసంతంలోకి  అడుగుపెట్టారు సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌. మంగళవారం ఆయన ఆరోగ్యం బాగోలేదని అస్వస్థతకు గురయ్యారనే వార్తలు హల్‌చల్‌ చేశాయి. కొంతమంది ఔత్సాహికులు ఆయన మరణించారని కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రమోహన్‌   వీడియో ద్వారా స్పందించారు.  తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నమ్మవద్దని, ఆరోగ్యంగా ఉన్నానని ఆయన తెలిపారు. పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానుల ఆశీస్సులే శ్రీరామ రక్ష అని చంద్రమోహన్‌ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here