ఒకే కాన్పులో 9 మందికి జ‌న్మ‌నిచ్చిన 25 ఏండ్ల మ‌హిళ‌

0
112
Spread the love

ఒకే కాన్పులో 9 మందికి జ‌న్మ‌నిచ్చిన 25 ఏండ్ల మ‌హిళ‌

  ఐదుగురు ఆడ‌పిల్ల‌లు, న‌లుగురు అబ్బాయిలు..తల్లి పిల్లలు క్షేమం

మాలీ (ప‌శ్చిమాఫ్రికా) మే 5 (ఎక్స్ ప్రెస్ న్యూస్);కొంత మంది మ‌హిళ‌లు ఒకే కాన్పులో క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డం చూశాం. ఇంకొంత మంది మ‌హిళ‌లు ఒకే కాన్పులో ముగ్గురు, న‌లుగురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డం చూశాం. కానీ ఈ 25 ఏండ్ల మ‌హిళ మాత్రం ఏకంగా ఒకే కాన్పులో 9 మందికి జ‌న్మ‌నివ్వ‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు.ప‌శ్చిమాఫ్రికాలోని మాలీ దేశానికి చెందిన హ‌లీమా సిస్సే(25) 9 నెల‌ల క్రితం గ‌ర్భం దాల్చింది. ఈ క్ర‌మంలో నెల‌లు నిండుతున్న కొద్ది ఆమెకు వైద్యులు స్కానింగ్ చేశారు. ఈ ప‌రీక్ష‌ల్లో ఆమె క‌డుపులో ఏడుగురు పిల్ల‌లు ఉన్న‌ట్లు గుర్తించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను మార్చి నెల‌లో మాలీలోని మోరాకోకు త‌ర‌లించారు. ఆ గ‌ర్భిణి మంగ‌ళ‌వారం డెలివ‌రీ అయింది. డాక్ట‌ర్లు ఏడుగురు పిల్ల‌లే జ‌న్మిస్తారు అనుకున్నారు. కానీ అద‌నంగా మ‌రో ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టేస‌రికి వైద్యులు షాక్ అయ్యారు. వీరిలో ఐదుగురు ఆడ‌పిల్ల‌లు, న‌లుగురు అబ్బాయిలు ఉన్నారు. త‌ల్లి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని, పిల్ల‌లో కొంద‌రు బ‌ల‌హీనంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. హ‌లీమాకు సీజేరియ‌న్ నిర్వ‌హించిన‌ట్లు వారు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here