వ్యవసాయ రంగం, ఆహార ఉత్పత్తి లో తెలంగాణా రాష్ట్ర సహకారం తీసుకుంటాం – చార్లెస్ బాస్టేన్

0
266
Spread the love

వ్యవసాయ రంగం, ఆహార ఉత్పత్తి లో తెలంగాణా రాష్ట్ర సహకారం తీసుకుంటాం – చార్లెస్ బాస్టేన్

సీ షెల్స్ దేశంలో వ్యవసాయ రంగం, ఆహార ఉత్పత్తి లో తెలంగాణా రాష్ట్ర సహకారం తీసుకుంటామని సీ షెల్స్ దేశ వ్యవసాయం,ఫిషరీస్ శాఖల మంత్రి శ్రీ చార్లెస్ బాస్టేన్ అన్నారు. తేది. 23 నుండి 25 వరకు మూడు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన సీ షెల్స్ దేశ వ్యవసాయం, ఫిషరీస్ శాఖల మంత్రి శ్రీ చార్లెస్ బాస్టేన్ బుధవారం రోజున తెలంగాణ సచివాలయం లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె. జోషి తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె. జోషి, తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యత పథకాలను, ముఖ్యంగా వ్యవసాయ రంగం లో రైతుల అభివృద్దికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత నిచ్చి రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నదని తెలిపారు. e – NARM (నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) విధానం, రైతు బంధు పథకం, సీడ్ ఇండస్టీ, రాష్ట్రంలో అధికం గ సాగు చేయబడుతున్న పంటల గురించి వివరించారు. సేంద్రీయ మేళాలో భాగంగా రాబోయే “జూన్ 26 నుండి జులై 3 వరకు 32nd ISTA Congress” అంతర్జాతీయ సీడ్ ఫెస్టివల్ కాంగ్రెస్ ను నిర్వహించనున్నామని తెలిపారు.
సీ షెల్స్ దేశ వ్యవసాయం,ఫిషరీస్ శాఖల మంత్రి శ్రీ చార్లెస్ బాస్టేన్ మాట్లాడుతూ, తమ దేశ రైతులను పరిశీలనకు ఇక్కడికి పంపుతామని, అవసరమైన సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈ సందర్భంగా కోరారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సి. పార్థసారథి, వ్యవసాయ శాఖ కమిషనర్ శ్రీ రాహుల్ బొజ్జా, ఉద్యానవ శాఖ కమిషనర్ శ్రీ వెంకట్రామిరెడ్డి,మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ శ్రీమతి లక్ష్మీదేవి, ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ, యునివర్సిటీల సైంటిస్టులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here