షేక్ పేట్ అతి పెద్ద ఫ్లైఓవర్ ప్రారంభం

0
45
Spread the love
*హైదరాబాద్, జనవరి 01:*     ఎస్.ఆర్.డి.పి ద్వారా హైదరాబాద్ అభివృద్ది చేస్తున్నట్లు రాష్ట్ర  పురపాలక పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారక రామారావు అన్నారు.  వ్యూహాత్మక రోడ్డు అభివృద్ది పథకం ద్వారా రూ. 333.55 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన షేక్ పేట్ అతి పెద్ద ఫ్లైఓవర్ ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు  తలసాని శ్రీనివాస్ యాదవ్, సబిత ఇంద్ర రెడ్డి, మహమూద్ ఆలి,   ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికేపూడి గాంధీ,  ముఠా గోపాల్ డిప్యూటీ మేయర్  శ్రీలత శోభన్ రెడ్డి  లతో కలిసి మంత్రి ప్రారంభించారు.
 
ఈ కార్యక్రమంలో  పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక సెక్రెటరీ అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్  డి.ఎస్ లోకేష్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్  శ్రీధర్, సి.ఈ దేవానంద్, ఎస్.ఈ వెంకటరమణ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన    సమావేశంలో మంత్రి  కే.టి.ఆర్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి మాస పుత్రిక అయిన ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన పనులలో  ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు, ఆర్.ఓ.బి లు  తదితర పనులు 24  పనులు అందుబాటులోకి వచ్చాయన్నారు. అందు కోసం ఆరు వేల కోట్ల ఖర్చు చేసినట్లు హైదరాబాద్ నగరం ట్రాఫిక్ వ్యవస్థ చాలా వరకు మెరుగు పడిందన్నారు. మిగితావి  పురోగతిలో ఉన్నాయన్నారు. ఏడేళ్ల కాలంలో ఎంతో అభివృద్ది సాధించుకున్నాం. ఇంకా అభివృద్ది చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
 రిజర్వు బ్యాంక్ నివేదిక ప్రకారం  భారత దేశంలో చిన్న వసస్సు గల రాష్ట్రం భౌగోళికంగా 11 రాష్ట్రం,  ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తున్న  రాష్ట్రాలలో 4వ స్థానంలో ఉందన్నారు. హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఎస్.ఆర్.డి.పి, సి.ఆర్.ఏం.పి పథకాలతో పాటుగా హైదరాబాద్  రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కూడా 132 లింక్ మిస్సింగ్ రోడ్లను కోట్లాది రూపాయలతో చేపట్టడం జరిగింది.
 
 సి.ఆర్.ఎం.పి ద్వారా ఐదేళ్లలో  709 కిలో మీటర్ల రోడ్డును అభివృద్ది చేయాలని లక్ష్యంగా  పెట్టుకోగా ఇప్పటి వరకు సుమారు 5 వందల కిలోమీటర్లను అభివృద్ది  చేయడం జరిగింది. రానున్న రెండేళ్లలో మిగతా రోడ్డును పూర్తి చేయడం జరుగుతుందన్నారు.
ఇటీవలనే ఔటర్ రింగురోడ్డు మొత్తం ఎల్.ఇ.డి లైటింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
 
కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న 21 రోడ్లను కంటోన్మెంట్ అధికారులు రూల్స్ కు వ్యతిరేకంగా మూసి వేశారని  ఈ విషయం గత ఏదేళ్ల నుండి కేంద్ర ప్రభుత్వానికి చెందిన రక్షణ శాఖ  నల్గురు మంత్రులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని  ఈ విషయంలో కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారితో మాట్లాడాలని ఓపెన్ చేయించాలని  కోరారు. ఎస్.ఆర్.డి.పి ద్వారా కంటోన్మెంట్ ప్రాంతాల్లో  చేపట్టే రోడ్లకు రక్షణశాఖ భూములు అవసరం ఉంటాయని అన్నారు. ప్యాట్ని నుండి  కొంపల్లి వరకు జె.బి.ఎస్ నుండి  తుర్కపల్లి వరకు ఫ్లై ఓవర్  నిర్మాణాలకు ప్రణాళిక సిద్ధం చేశామని రక్షణ శాఖ భూములు కేటాయించాలన్నారు. ఉత్తర ప్రదేశ్ రక్షణ శాఖ భూములు  ఇచ్చారు. కానీ తెలంగాణలో గత ఏడేళ్లుగా కోరిన ఇవ్వడం లేదని వాటిని అప్పగించేలా కిషన్ రెడ్డి  గారు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా హైదరాబాద్ చారిత్రాత్మక  నగరంగా ప్రసిద్ది చెందిన నేపథ్యం భవిష్యత్తు తరాల వారికి అందించేలా కేంద్ర  పర్యాటక శాఖ మంత్రి కృషి చేయాలన్నారు. హెరిటేజ్ సిటీగా  నగరం వారసత్వ సంపద  కాపాడాల్సిన అవశ్యకత ఉందన్నారు. యూనిసెఫ్ ద్వారా గుర్తింపు తేవాలని కోరారు. సైన్స్ సిటీ ఏర్పాటు  అవసరమైన భూసేకరణ చేసి  ఇస్తానని సంబంధిత మంత్రి చెప్పి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా సమిష్టి కృషి చేసి భవిష్యత్ తరాల వారికి మంచి హైదరాబాద్ ను అందించే భాధ్యత  మన అందరి పై ఉందన్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతిఒక్కరికీ మంత్రి కె.టీ.ఆర్ శుభాకాంక్షలు  తెలిపారు.
 
 కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గతంలో 70 యేళ్ల కాలం ఎప్పుడు రాష్ట్రానికి రాని రోడ్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హయంలో వచ్చాయని మంజూరైన జాతీయ రహదారులను కేంద్ర మంత్రి గడ్కారీతో త్వరలో పనులను ప్రారంభించేందుకు శంకుస్థాపన చేయనున్నట్లు  పేర్కొన్నారు. సైన్స్ సిటీ ఏర్పాటుకు  25 ఏకరాల సేకరణ చేయాలని  ఇటీవలనే రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ వ్రాయడం జరిగిందని ఎంత తొందరగా భూసేకరణ ఇస్తే అంత తొందరగా    ప్రారంభిస్తామన్నారు.  రీజనల్ రింగు రోడ్డు కూడా భూసేకరణ తొందరగా పూర్తి చేయాలని కోరారు. హైదరాబాద్ నగరం రోజు రోజుకు అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల వారు ఇతర జిల్లాల వారు హైదరాబాద్ లో స్టిర  పడుతున్నారు. 7 టూమ్స్ అభివృద్ధికి స్వదేశీ దర్శన్ పథకం క్రింద నిధులు మంజూరు   చేశామన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నగర వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఏ కార్యక్రమమైనా కరోనా ప్రోటోకాల్ పాటించాలన్నారు.
 
రాష్ట్ర  పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… గత ప్రభుత్వాల హయంలో నగర అభివృద్ధికి ముందు చూపులేక ఏమాత్రం అభివృద్ది జరగలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారు హైదరాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. వరద శాశ్వత నివారణకు ప్రత్యేక చొరవ చేస్తున్నానని, నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వము నుండి 10 వేల కోట్ల నిధులు ఇప్పించాలని తలసాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినీ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here