సింగర్ సునీత – రామ్ మ్యారేజ్ డేట్ ఫిక్స్….!

0
676
Spread the love

టాలీవుడ్‌ ప్రముఖ గాయని సునీత పెళ్లి తేదీ ఫిక్స్ అయింది. ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్‌ వీరపనేనితో కొద్దిరోజుల క్రితం ఆమె నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌లోనే వీరి పెళ్లి జరుగుతుందని అనుకున్నప్పటికీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సునీత-రామ్ వివాహం జనవరి 9న జరిపేందుకు రెండు కుటుంబాలు నిశ్చయించినట్లు తెలుస్తోంది.

సునీత మొదటి భర్తతో చాలాకాలం క్రితమే విడిపోయి పిల్లలతో కలిసి ఉంటున్నారు. అయితే తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు కొద్దిరోజుల క్రితమే ప్రకటించి నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేశారు. ఇద్దరి జాతకాల ప్రకారం వివాహం డిసెంబర్ 26న చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే అనుకోని కారణాలతో పెళ్లి వాయిదా పడింది.

గత వారం కాబోయే భర్తతో కలిసి ఆమె ప్రీ వెడ్డింగ్ పార్టీలో పాల్గొన్న ఫోటోలు వైరల్‌గా మారాయి. తాజాగా వీరి వివాహాన్ని జనవరి 9న నిర్వహించాలని ఇరు కుటుంబసభ్యులు నిశ్చయించారట. వివాహానికి కుటుంబసభ్యులు, బంధుమిత్రులను మాత్రమే ఆహ్వానిస్తారని తెలుస్తోంది. మరోవైపు సినీ పరిశ్రమలోని సెలబ్రిటీల కోసం సునీత-రామ్ కలిసి ఈరోజు(శనివారం) ప్రీ వెడ్డింగ్‌ పార్టీని ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here