ఒక్క పిల్లోడు పోషణలోపంతో ఉండోద్దన్న ఉద్దేశ్యంతోనే మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ కు శ్రీకారం

0
91
Spread the love

ఒక్క పిల్లోడు పోషణలోపంతో ఉండోద్దన్న ఉద్దేశ్యంతోనే మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ కు శ్రీకారం


– సిరిసిల్ల లోని రాజీవ్ నగర్ అంగన్వాడి కేంద్రంలో మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ కు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి


TOOFAN – సిరిసిల్ల 10, సెప్టెంబర్ 2022: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక్క పిల్లోడు పోషణలోపంతో ఉండోద్దన్న ఉద్దేశ్యంతోనే మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ కు శ్రీకారం చుట్టామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

సిరిసిల్ల పట్టణం రాజీవ్ నగర్ ZPHS ఆవరణలో అంగన్వాడి కేంద్రంలో పండుగ వాతావరణంలో పోషణ మాహ్ కార్యక్రమంలో భాగంగా చిరు ధాన్యాల పోషకాహార పండుగ కార్యక్రమం ప్రారంభం అయ్యింది.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పిల్లల తల్లిదండ్రులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సివియర్, మోడరేట్ పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల వివరాలను విడుదల చేసింది. జిల్లాలో 700 మంది పిల్లలు తీవ్ర పోషకాహార రూపంతో మరో 200 మంది పిల్లలు అతి తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తెలిపింది.
దాన్ని బెంచ్ మార్క్ గా తీసుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక్క పిల్లోడు పోషణలోపంతో ఉండోద్దన్న ఉద్దేశ్యంతోనే మంత్రి శ్రీ కే తారక రామారావు సూచన మేరకు మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ను ఈ రోజు ప్రారంభించామని తెలిపారు.
ఇప్పటికే అంగన్వాడి కేంద్రాల ద్వారా జీరో నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు పోషకాహారం అందిస్తుండగా దానిని మరింత మెరుగుపరిచి చిరుధాన్యాలతో కూడిన రాగి లడ్డూలు ఇతర ఆహార పదార్థాలను పిల్లలకు అందించి వారి ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచాలన్న ఉద్దేశంతో జిల్లాలోని 587 అంగన్వాడి కేంద్రాల పరిధిలోని నమోదైన 36 వేల మంది పిల్లలకు పైగా లబ్ధి చేకూర్చేందుకు మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ అనే కార్యక్రమం అమలు చేస్తున్నాం. ప్రతి శనివారం ఒక్కో పిల్ల వాడికి రాగి పిండి, నెయ్యి, బెల్లంతో కూడిన ఒక్కో లడ్డు లను అందజేస్తామని తెలిపారు. బాలింతలు, గర్భిణులకు కూడ పోషకాహారం అందిస్తామని అన్నారు. ప్రతి నెల రెండవ శనివారం నిర్వహించే ఈ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ద్వారా చిరు ధాన్యాల ప్రాధాన్యత పై ప్రజలకు అవగాహన , చైతన్యం కలుగుతుందన్నారు.

ఎనీమియా సమస్యతో గర్భిణీలు, బాలింతలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. గర్భిణులకు ఎనీమియా వల్ల ప్రసవ సమయంలో హై రిస్క్ ఏర్పడుతుందన్నారు. ఎనీమియా వల్ల ఆరు ఏండ్ల లోపు శిశువుల మానసిక, భౌతిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. పిల్లల ఆరోగ్యం దెబ్బతింటే దేశ భవిష్యత్తు కూడా దెబ్బతింటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పోషణ పై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టి ఒక ఉద్యమ రూపంలో అన్ని మున్సిపాలిటీ వార్డులు గ్రామపంచాయతీలోని అంగన్వాడీ కేంద్రాలలో మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. మాల్ న్యూట్రిషన్ పై పోరాటం చేయడంలో మీడియా కూడా ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అభివృద్ధి వస్తున్న కొద్ది బిపి, సుగర్, హై పర్ టెన్షన్ లాంటి జీవితకాల వ్యాధులు పెరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ అన్నారు.


శారీరక శ్రమ లేకుండా వచ్చే వ్యాధులు కొన్ని కాగా పోషకాహారంతో వచ్చే జీవితకాల వ్యాధులు మరికొన్ని అని జిల్లా కలెక్టర్ తెలిపారు. వీటిపై పోరాటం చేసేందుకు చిరుధాన్యాలు అనే ఆయుధంతో పోరాటం చేయవలసిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్న వాస్తవాన్ని పిల్లల తల్లిదండ్రులు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి సంతులిత ఆహారం అందించాలని అన్నారు. జిల్లాలోని అందరు గర్భిణీలు , బాలింతలు తప్పనిసరిగా రక్తహీనత పరీక్షలు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నట్లయితే ఐరన్ తో కూడిన మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని మాల్ న్యూట్రిషన్ సమస్యను అధిగమించాలని తద్వారా రాజన్న సిరిసిల్లాను ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చిదిద్దేందుకు తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్ పర్సన్ లు పిల్లలకు లడ్డూలు పంపిణీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here