త్వరలోనే సూర్యాపేటలో ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్: జగదీష్ రెడ్డి

0
165
Spread the love

త్వరలోనే సూర్యాపేటలో ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్: జగదీష్ రెడ్డి

సూర్యాపేట మే 13 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: త్వరలోనే సూర్యాపేటలో ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో మెడికల్ అనుబంధంగా ఉన్న ప్రభుత్వ దవాఖానలో పర్యటించి అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లడారు.కొవిడ్ పట్ల ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని మంత్రి కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొవిడ్ అదుపులోనే ఉందని, కొవిడ్ తీవ్రత తగ్గిందని మంత్రి తెలిపారు. ఇక కరోనా వచ్చిన వారికి వైద్యం అందించే విషయంలో అప్రమత్తంగా ఉన్నామని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రిల్లో వైద్య సేవలను, సరిపడా మందులను అందుబాటులో ఉంచామన్నారు. ఆక్సిజన్ బెడ్స్, ఐసీయూ బెడ్స్ సిద్ధంగా ఉంచామని, జిల్లాలో అన్ని దవాఖానలకు సరిపడా ఆక్సిజన్‌ స్టాక్‌ను సిద్ధిం చేసినట్లు తెలిపారు. ప్రైవేట్‌ హాస్పిట్సల్స్‌ ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై, మందులను కృత్రిమ కొరత సృష్టించిన వారిపై కఠినంగా శిక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు.ఇక కరోన కట్టడి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నదని ప్రజలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.సమావేశంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, డీఎంహెచ్‌వో కోటా చలం, దవాఖాన సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి, ఆర్డీవో రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here