బిగ్ బాస్ ఫినాలేకు గెస్ట్‌‌‌‌‌‌గా మెగాస్టార్ తో పాటు మరో యంగ్ హీరో…!

0
78
Spread the love

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 చివరి అంకానికి వచ్చేసింది. మిగిలిన ఐదుగురు ఇంటిసభ్యుల్లో ఒకరు విజేతగా నిలవనున్నారు. ఈ సీజన్ లో ఎవరు విజేత అవుతారని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 20న బిగ్ బాస్ ఫినాలే జరగనుంది. ఈ ఫినాలేను భారీగా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రానున్నారని ప్రచారం జరుగుతుంది. ముద్దుగుమ్మలు మెహరీన్, లావ‌ణ్య త్రిపాఠి తమ డ్యాన్స్ లతో ఆకట్టుకోనున్నారని టాక్ నడుస్తుంది. ఇక ఈ ఫినాలేకు చిరుతోపాటు మరో గెస్ట్ కూడా రాబోతున్నారని సమాచారం.

దసరా సందర్భంగా జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో సమంత హోస్ట్ చేయగా అక్కినేని అఖిల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య గెస్ట్ గా రాబోతున్నాడని అంటున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతన్య ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయనున్నాడని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే కు మరింత జోష్ తెచ్చేలా ఈ తండ్రీకొడుకులు సందడి చేయనున్నారని అంటున్నారు. చైతన్యతో పాటు హీరోయిన్ సాయిపల్లవి కూడా ఫినాలేకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ వార్తలలో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here