కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణి

0
226
Spread the love

కూలీలకు  నిత్యావసర సరుకులు పంపిణి చేసిన సంస్థలు

శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట ఆద్వర్యం లో కొత్తపేట న్యూ మారుతీ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద దినసరి కూలీ పనులు చేసుకునే వారికి నిత్యావసర సరుకులు పంపిణి చేసి వాళ్లకు ఆసరాగా నిలిచారు. లాక్ డౌన్ వలన పనులు నిలిచిపోవడం తో పని లేక పస్తులతో ఉన్న దినసరి కూలీలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆపదకాలం పేదవారిని ఆదుకోవడం చాల అవసరం అని శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఫౌండర్ డా.ఎర్రం పూర్ణశాంతి గుప్త పేర్కొన్నారు. కోవిద్ మహమ్మారి రెండవసారి వచ్చి ఇందరిపై విరుచుకు పడటం తో వ్యవస్థ అతలాకుతలం అవుతుందని, ఈ సమయం లో ఇన్కమ్ చూసుకునే కన్నా ఇమ్మ్యూనిటి చూసుకుంటే మనిషి దక్కుతున్నారని, అందుకే ఇమ్మ్యూనిటి కలిగిన పప్పులతో నిత్యావసర సరుకులు పేదవారికి అందించడం జరుగుతుందని డా.ఎర్రం పూర్ణశాంతి గుప్త చెప్పారు. తాము అందించే చిన్నది కావచ్చు కానీ ప్రతి ఒక్కరు ఆత్మా విశ్వాసం తో ముందుకు సాగాలని సూచించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట రీజియన్ సేవలు అభినందనీయమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here