శ్రీధర్ భూశెట్టి, C/O జయచంద్ర స్టూడియోస్

0
293
Spread the love

మనవాడు పలానా ప్రాంతంలో నడిబొడ్డున జెండా పాతాడురా అని అందరూ గొప్పగా చెప్పుకుంటారు. కానీ శ్రీధర్ గారు జూబ్లీహిల్స్ ఆరంభంలోనే జెండా పాతి జయహో శ్రీధర్ అనిపించుకున్నారు, అనిపించుకుంటున్నారు.. ఎంతోమంది సెలెబ్రెటీల తలలో నాలుకై వారింట్లో ఏ శుభకార్యం జరిగినా అందరి చూపు శ్రీధర్ వైపు ఉండేలా ప్రతిక్షణం కంటిముందు కెమెరాతో బంధుమిత్రుల మధురస్మృతులను బందించి మరపురాని మధురస్మృతులుగా మిగిల్చి మనవాడిగా అందరి మన్ననలు పొందారు తన ఫోటోగ్రఫీ తో మన జయచంద్ర స్టూడియోస్ శ్రీధర్ గారు. జయలక్ష్మి, చంద్రశేఖర్ గార్లకు ముద్దుబిడ్డ అయిన శ్రీధర్ గారు మహబూబ్ నగర్ గడ్డ గర్వపడేలా ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఫోటోగ్రఫీ మీద మక్కువతో
అనుక్షణం అమ్మ, నాన్నలను గుర్తుచేసుకునేలా వారి పేరు మీద 1989లో జయచంద్ర స్టూడియోస్ ని స్థాపించారు శ్రీధర్ గారు. స్థాపించిన అయిదు సంవత్సరాలకే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత D.రామానాయుడు గారి సినిమాలలో వర్క్ చేసే అవకాశం దక్కించుకున్నారంటే ఆయనకు కష్టపడే మనస్తత్వం, పనిమీద నిబద్దత, అన్నిటికి మించి ఫోటోగ్రఫీ మీద ఉన్న ప్రేమే కారణం. రామానాయుడు గారి ప్రోత్సాహం, అమ్మ జయలక్ష్మి గారి ప్రోద్బలంతో 1994 వ సంవత్సరంలో సినీరంగ ప్రవేశం చేసి ఎన్నో హిట్ మూవీస్ కి ఫోటోగ్రఫీ అందించారు శ్రీధర్ భూశెట్టి గారు. తాజ్ మహల్, శివయ్య, నీ ప్రేమకై నిరీక్షణ, శ్రావణమాసం, ప్రేమ పల్లకి, వీరుడు, హమ్ ఆప్ కె దిల్ మె రహత హై , పెళ్లైందా లేదా, మధు మాసం సినిమాలను నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్ కి వర్క్ చెయ్యడం ఎంతో గొప్పగా భావించే శ్రీధర్ గారికీ రామానాయుడి గారంటే ఎనలేని గౌరవం. పని మీద నిబద్దత, వయసు ఉండగానే కష్టపడటం రా.నా. గారి దగ్గరే నేర్చు కున్నాను అని చెప్పేవారు శ్రీధర్ గారు. మనీ విషయంలో ఖచ్చితత్వం ఆయన నైజం. మధుమాసం హిట్ తర్వాత మళ్లి ఆయన్ను జయచంద్ర స్టూడియోస్ వైపుకు తిప్పాయి ఆయనకు వచ్చిన అవకాశాలు. అవును ఎంతో మంది IAS, IPS, సినీ రాజకీయ నాయకుల ఇళ్లల్లో ఏ శుభకార్యం జరిగిన శ్రీధర్ తన కెమెరాతో మంటపం ముందు ఉండాల్సిందే అని కోరుకునేవారు.
అందరికి అందుబాటులో ఉండాలి అనే ఆలోచనతో తన స్టూడియోస్ ని ఆడికెమెట్ నుండి మార్చి జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకుని అనుక్షణం అందరూ మెచ్చుకునేలా ఫోటోగ్రఫీ ని అందించారు శ్రీధర్ గారు . ఫోటోగ్రఫీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీధర్ గారు ఆర్థికంగా తాను సంపాదించిన దాంట్లో ఎంతోకొంత సోషల్ సర్వీస్ కోసం ఉపయోగిస్తున్నారు. ఎంతో కష్ట పడుతూ ఇష్టంగా చేస్తున్న ఫోటోగ్రఫీ జర్నీ ఇలాగే కొనసాగిస్తూ పదిమందికి ఉపయోగపడేలా, నేర్చుకునేలా ఉండాలని కోరుకుంటూ “జయహో జయచంద్ర”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here