స్వామి ప్ర‌భుపాద పేరున స్మార‌క నాణేన్ని విడుద‌ల చేసిన ప్ర‌ధాని

0
47
Spread the love

శ్రీల భ‌క్తివేదాంత‌ స్వామి ప్ర‌భుపాద గారి 125వ జ‌యంతి సంద‌ర్భం లో ఒక ప్ర‌త్యేకమైన స్మార‌క నాణేన్ని విడుద‌ల చేసిన ప్ర‌ధాన మంత్రి

Srila Bhaktivedanta Swami Prabhupada Ji was also a great devotee of Bharat: PM

శ్రీల భ‌క్తివేదాంత‌ స్వామి ప్ర‌భుపాద గారు భార‌త‌దేశం గొప్ప భ‌క్తుడు కూడాను: ప్ర‌ధాన మంత్రి

It is our resolve that the world should benefit from our knowledge of Yoga and Ayurveda: PM

మ‌న‌కు ఉన్న యోగ మ‌రియు ఆయుర్వేద జ్ఞానం నుంచి ప్ర‌పంచం లాభ‌ప‌డాల‌న్న‌దే మ‌న సంక‌ల్పం గా ఉంది: ప్ర‌ధాన మంత్రి

Difficult to imagine the status and form of India without the social revolution of the Bhakti period: PM

భ‌క్తి యుగం తాలూకు సామాజిక క్రాంతి లేనిదే భార‌త‌దేశం హోదాను, రూపాన్ని ఊహించ‌డం క‌ష్టం: ప్ర‌ధాన మంత్రి

Srila Bhaktivedanta Swami Prabhupada Ji connected Bhakti Vedanta with the consciousness of the world

శ్రీ‌ల భ‌క్తివేదాంత స్వామి ప్ర‌భుపాద గారు భ‌క్తి వేదాంతాన్ని ప్ర‌పంచ చైత‌న్యం తో జోడించారు

శ్రీ‌ల భ‌క్తివేదాంత స్వామి ప్ర‌భుపాద గారి 125వ జ‌యంతి సంద‌ర్భం లో ఒక ప్ర‌త్యేక‌మైన స్మార‌క నాణేన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భం లో సంస్కృతి, ప‌ర్య‌ట‌న‌, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ (DoNER) కేంద్ర మంత్రి శ్రీ జి. కిష‌న్ రెడ్డి త‌దిత‌రులు పాలుపంచుకొన్నారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రోత‌ల ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ, ఒక రోజు ముందే జ‌న్మాష్ట‌మి రావ‌డం, మ‌రి దానితోపాటే శ్రీల ప్ర‌భుపాద గారి 125వ జ‌యంతి కూడా కావ‌డం సంతోష‌దాయ‌క‌మైన‌టువంటి యాదృశ్చిక ఘ‌ట‌న అని ప్ర‌స్తావించారు. ఇది ఎలా ఉంది అంటే, సాధ‌న ద్వారా సంతృప్తి ని, సంతోషాన్ని ఏక బిగిన సాధించుకోవ‌డం అని ఆయ‌న అన్నారు. అంతేకాకుండా, ఈ సంద‌ర్భం ‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’ సంబ‌రాల మ‌ధ్య చోటు చేసుకొంటోంది అని కూడా ఆయ‌న గుర్తు కు తెచ్చారు. శ్రీల ప్ర‌భుపాద స్వామి గారి కి చెందిన ల‌క్ష‌ల కొద్దీ అనుచ‌రులు మ‌రియు ప్ర‌పంచం అంత‌టా విస్త‌రించి ఉన్న‌టువంటి ల‌క్ష‌లాది కృష్ణ భ‌క్తులు ఈ రోజు న ఇటువంటి అనుభూతి ని పొందుతున్నారు అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

కృష్ణ భ‌గ‌వానుడు అంటే ప్ర‌భుపాద స్వామి గారి కి ఉన్న‌టువంటి మ‌హ‌నీయ భ‌క్తి ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, ఆయ‌న భార‌త్ కు కూడా ఒక గొప్ప భ‌క్తుడు అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటం లో ఆయ‌న క‌దం తొక్కార‌ని వివ‌రించారు. స‌హాయ‌ నిరాక‌ర‌ణ ఉద్య‌మానికి మ‌ద్ధ‌తు గా స్కాట్‌లాండ్ కు చెందిన ఒక క‌ళాశాల నుంచి డిప్లొమా ను స్వీక‌రించ‌డానికి ఆయ‌న ఒప్పుకోలేద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

యోగ ను గురించిన మ‌న జ్ఞానం ప్ర‌పంచం అంత‌టా విస్త‌రించింద‌ని, అదే మాదిరిగా భార‌త‌దేశం అనుస‌రించిన నిల‌క‌డ‌త‌నం తో కూడిన జీవ‌నశైలి, ఆయుర్వేద వంటి విజ్ఞాన శాస్త్రం కూడా ప్ర‌పంచం అంత‌టా వ్యాప్తి చెందాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. వీటి ద్వారా యావ‌త్తు ప్ర‌పంచం ప్ర‌యోజ‌నాలు పొందాలి అనేదే మ‌న సంక‌ల్పం గా ఉంది అని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. మ‌నం మ‌రే దేశానికైనా వెళ్ళిన ప్ర‌తిసారీ అక్క‌డి ప్ర‌జ‌ల ను క‌లుసుకొన్నప్పుడు వారు ‘హ‌రే కృష్ణ’ అంటూ మ‌నతో భేటీ అవుతున్నార‌ని, దీని ద్వారా మ‌నం మ‌రింత భావ‌న ను పొందుతూ గ‌ర్వ‌ప‌డుతున్నామ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్ప‌త్తులు అదే విధ‌మైన అప్యాయ‌త ను అందుకొన్న‌ప్పుడు కూడా ఇదే విధ‌మైన భావ‌న ఏర్ప‌డుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ విష‌యం లో ఐఎస్‌కెసిఒఎన్-‘ఇస్కాన్’ నుంచి మ‌నం ఎంతో నేర్చుకోవ‌చ్చున‌ని ఆయ‌న అన్నారు.

బానిస‌త్వం కాలం లో భ‌క్తి అనేది భార‌త‌దేశం తాలూకు స్ఫూర్తి ని స‌జీవం గా ఉంచింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. భ‌క్తి యుగం తాలూకు సామాజిక క్రాంతి అంటూ ఏదీ లేక‌పోతే భార‌త‌దేశం తాలూకు హోదా, భార‌త‌దేశం తాలూకు స్వ‌రూపం.. వీటిని ఊహించ‌డానికి క‌ష్ట‌మైపోయేది అని నేటి పండితులు అభిప్రాయ‌ప‌డుతున్నార‌ని ఆయ‌న అన్నారు. భ‌క్తి అనేది విశ్వాసం, సామాజిక అంత‌స్తులు విశేష అధికారాలు అనే వివ‌క్ష ను తొల‌గించి ప్రాణి ని దైవం తో జ‌త‌ ప‌ర‌చింద‌ని ఆయ‌న అన్నారు. అటువంటి క‌ష్ట‌ కాలాల లో సైతం చైత‌న్య మ‌హా ప్ర‌భు గారు వంటి సాధువులు సంఘాన్ని భ‌క్తి తాలూకు స్ఫూర్తి తో ముడిపెట్టి ‘ధ‌ర్మం నుంచి విశ్వాసం’ అనే మంత్రాన్ని అందించార‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

ఒక కాలం లో స్వామి వివేకానందుల వారు వంటి ఒక ముని వేదాంతాన్ని ప‌శ్చిమ దేశాల చెంత‌కు తీసుకుపోగా, శ్రీల ప్ర‌భుపాద గారు మ‌రియు ఇస్కాన్ ప్ర‌పంచానికి భ‌క్తి యోగ ను అందించేట‌టువంటి ఒక బృహ‌త్త‌ర బాధ్య‌త ను తీసుకున్నార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఆయ‌న భ‌క్తి వేదాంతాన్ని ప్ర‌పంచం తాలూకు చైత‌న్యం తో పెన‌వేశార‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

ప్ర‌స్తుతం ప్ర‌పంచం లో వివిధ దేశాల లో ఇస్కాన్ ఆల‌యాలు వంద‌ల సంఖ్య లో ఉన్నాయ‌ని, మ‌రి అనేక గురుకులాలు భార‌తీయ సంస్కృతి ని నిల‌బెడుతున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. భార‌త‌దేశాని కి ధ‌ర్మం అంటే ఉత్సాహం, ఉద్వేగం, ఆనందం ల‌తో పాటు, మాన‌వ జాతి ప‌ట్ల న‌మ్మ‌కం అని ప్ర‌పంచానికి ఇస్కాన్ ప్ర‌బోధించింద‌ని ఆయ‌న వివ‌రించారు. క‌చ్ లో భూకంపం సంభ‌వించిన‌ప్పుడు, ఉత్త‌రాఖండ్ దుర్ఘ‌ట‌న వేళ, అలాగే ఒడిశా లోను, బంగాల్ లోను తుఫానులు విరుచుకుప‌డిన‌ప్పుడు ఇస్కాన్ అందించిన సేవ‌ల ను గురించి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌ముఖం గా ప్ర‌క‌టించారు. మ‌హ‌మ్మారి కాలం లో ఇస్కాన్ కృషి ని కూడా ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here