తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ ప్రమాణస్వీకారం

0
140
Spread the love

తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ ప్రమాణస్వీకారం
చెన్నై మే 7 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా ముత్తువేళ్‌ కరుణానిధి స్టాలిన్‌ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొవిడ్ ప్రొటోకాల్స్ మధ్య ఈ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. స్టాలిన్ అనంతరం 34 మంది మంత్రులు సైతం ప్రమాణం స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు.మక్కల్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు, కొందరు కీలక నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన వెంటనే కేబినెట్‌ సమావేశమై.. కరోనా నివారణ చర్యలపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్యే, సినీ నటుడు ఉదయనిధి ప్రత్యేక ఆకర్షణగా నిలువగా.. స్టాలిన్‌ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ఆయన భార్య ఉద్వేగానికి లోనయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here