రాష్ట్రాల్లో విమానయాన రంగం మౌలిక అభివృద్ధి మరింత బలోపేతం

0
163
Spread the love

రాష్ట్రాల్లో విమానయాన రంగం మౌలిక అభివృద్ధి మరింత బలోపేతం

తెలంగాణ, మేఘాలయ ముఖ్యమంత్రులకు లేఖలు రాసిన పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం.సింధియా

పీఐబి హైదరాబాద్: విమానయాన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి సంబంధిత అంశాలను వేగవంతం చేయడంలో తమ వ్యక్తిగత జోక్యాన్ని కోరుతూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా తెలంగాణ, మేఘాలయ ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు లేఖ రాస్తూ, సింధియా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (హెచ్ఐఏఎల్) కోసం రాయితీ ఒప్పందం గడువు పొడిగింపు గురించి ప్రస్తావించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్మాణం, నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం, హెచ్ఐఏఎల్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మధ్య డిసెంబర్ 20, 2004 నాటి రాయితీ ఒప్పందం (సిఏ) ఉందని ఆయన పేర్కొన్నారు. సిఏ నిబంధన 13.7.1 ప్రకారం, హెచ్ఐఏఎల్ తన రాయితీ వ్యవధిని మొదట అనుకున్న 30 సంవత్సరాలకు మించి, అంటే మార్చి 23, 2038 దాటి 23.03.2068 వరకు మరో 30 సంవత్సరాలు పొడిగించాలని అభ్యర్థించింది. రాయితీ ఒప్పందం వ్యవధి పొడిగింపును హెచ్ఐఏఎల్ అభ్యర్థనను పునఃపరిశీలించి, దాని సిఫార్సులను పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిలేఖలో కోరారు.

వరంగల్ విమానాశ్రయం కార్యాచరణ, ప్రాంతీయ కనెక్టివిటీ పథకం (ఆర్సిఎస్) -ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) కింద చేర్చడం గురించి కూడా సింధియా ప్రస్తావించారు. వరంగల్ విమానాశ్రయం హెచ్ఐఏఎల్ కి 150 కిలోమీటర్ల దూరంలో ఉందని, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారంతో అభివృద్ధి చేయవచ్చని స్పష్టం చేశారు. ఈ అంశంపై హెచ్ఐఏఎల్,ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగు మార్గాలను యోచించవలసిందిగా ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా, తురా విమానాశ్రయం వేగవంతమైన కార్యాచరణకు మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కాన్రాడ్ కె సంగ్మా వ్యక్తిగత జోక్యం కోసం శ్రీ సింధియా అభ్యర్థించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆర్సిఎస్-ఉడాన్ని ప్రారంభించిందని, దేశంలోని ఉపయోగం తక్కువగా ఉన్న ఎయిర్‌పోర్టుల నుండి ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా ప్రజలకు విమాన ప్రయాణాన్ని భరించే స్థాయిలోక అందుబాటులోకి తేవడం గురించి ఆయన పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి మేఘాలయాలో విమానయాన రంగం అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను శ్రీ సంగ్మా దృష్టికి తీసుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here