చార్మినార్ జోన్ కులీ కుతుబ్ షా గ్రౌండ్ లో సమ్మర్ కోచింగ్ ప్రారంభం

0
79
Spread the love
చార్మినార్ జోన్ కులీ కుతుబ్ షా గ్రౌండ్ లో సమ్మర్ కోచింగ్ ప్రారంభం
 
 
*హైదరాబాద్, ఏప్రిల్ 26:*   జిహెచ్ఎంసి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ కోచింగ్ క్యాంపు చార్మినార్ జోన్ కులీ కుతుబ్ షా గ్రౌండ్ లో స్పోర్ట్ విభాగం డైరెక్టర్ ఎస్.ఎన్.బాషా, జాయింట్ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, కార్పొరేటర్ గౌస్, సాహిల్ ఖాన్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు నిర్వహించిన మార్చి ఫాస్ట్…అయా క్రీడల్లో నిర్వహించిన ప్రదర్శన అందరినీ ఆకట్టకున్నాయి. ఈ సందర్భంగా స్పోర్ట్స్ డైరెక్టర్ ఎస్.ఎన్. భాష మాట్లాడుతూ… జిహెచ్ఎంసి పరిధిలో సమ్మర్ స్పోర్ట్ క్యాంప్ 1968లో 15 మంది కోచ్ లు, 10 కేంద్రాల్లో 6 గేమ్స్ తో ప్రారంభమైనట్లు వివరించారు. ప్రస్తుతం 854 క్రీడా మైదానాలు, స్పోర్ట్ కాంప్లెక్స్ లలో  44 క్రీడలతో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
 
 జాయింట్ కమిషనర్ తిప్పర్తి యాదయ్య మాట్లాడుతూ… కరోనా నేపథ్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించ బడలేదని, ఈ సంవత్సరం 44 క్రీడలకు సంబంధించిన మెటీరియల్ అందించడం జరిగిందన్నారు. సమ్మర్ కోచింగ్ కు 800 మంది కోచ్ లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కార్పొరేటర్ గౌస్ మాట్లాడుతూ…. సమ్మర్ కోచింగ్ క్యాంప్ వలన పిల్లల్లో క్రీడా స్ఫూర్తి పెరుగుతుందని క్రీడల పట్ల ఆసక్తి పెరుగతుందన్నారు. జిహెచ్ఎంసి సమ్మర్ కోచింగ్ క్యాంపులను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కోచింగ్  క్యాంప్ లో పాల్గొనే పిల్లలకు యూనిఫాం అందజేయాలని కోరారు.  
 
ఈ సమావేశంలో డి.సి సూర్యకుమార్, స్పోర్ట్స్  ఏ.డి మాధవి, స్పోర్ట్ ఇన్స్పెక్టర్లు ఇంతియాజ్, రావూఫ్ తదితరులు పాల్గొన్నారు.
 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here