సెమి కండ‌క్ట‌ర్ చిప్స్ స‌ర‌ఫ‌రా పెంచేందుకు చ‌ర్య‌లు

0
83
Spread the love

సెమి కండ‌క్ట‌ర్ చిప్స్ స‌ర‌ఫ‌రా పెంచేందుకు చ‌ర్య‌లు

ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ సూచించిన‌ట్టుగా సెమికండ‌క్ట‌ర్ల చిప్స్ స‌ర‌ఫ‌రాల‌ను పెంచేందుకు ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. దిగువ పేర్కొన్న ప్రాజెక్టుల‌కు ఆమోదాన్ని తెలిపిందిః ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.
ఎ) ఘ‌న‌దృక్చ‌క్తి పౌనఃపుణ్యాన్ని(హైప‌వ‌ర్ ఫ్రీక్వెన్సీ) క‌లిగిన ఎల‌క్ట్రానిక్స్ కోసం ఇన్‌క్యుబేట‌ర్ (స్థిరోష్ణ పేటిక‌) , గాలియం నైట్రైడ్ అనుకూల వాతావ‌ర‌ణ వ్య‌వ‌స్థకు తోడ్ప‌డే కేంద్రం ఏర్పాటు.

బి) పిఎల్ఐ ప‌థ‌కం కింద ఎన్ఎఎన్‌డి ఫ్లాష్ మెమొరీను కూర్చి, ప‌రీక్షించి, ముద్రించి, ప్యాకేజింగ్ (ఎటిఎంపి) కోసం ప్రాజెక్టు ఏర్పాటు. సి) ప్రొడ‌క్ష‌న్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ – ఉత్ప‌త్తితో అనుసంధాన‌మైన ప్రోత్సాహ‌కం) ప‌థ‌కం కింద ట్రాన్సిస్ట‌ర్లు, డ‌యోడ‌లు త‌దిత‌ర విల‌క్ష‌ణ సెమికండ‌క్ట‌ర్ ప‌రిక‌రాల కోసం ప్రాజెక్టు.

డి) ఎల‌క్ట్రానిక్ భాగాలు, సెమికండ‌క్ట‌ర్లు (ఎస్‌పిఇసిఎస్‌) ఉత్ప‌త్తిని ప్రోత్స‌హించేందుకు ప‌థ‌కం కింద ఆర్థిక ప్రోత్సాహ‌కాలు)

ఈ స‌మాచారాన్ని భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ స‌హాయ మంత్రి శ్రీ క్రిష‌న్ పాల్ గుర్జ‌ర్ మంగ‌ళ‌వారం లోక్‌స‌భ‌కు ఇచ్చిన లిఖితపూర్వ‌క జ‌వాబులో వెల్ల‌డించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here