ఎంపీ రఘురామకృష్ణ రాజుకు బెయిల్ మంజూరు

0
139
Spread the love

ఎంపీ రఘురామకృష్ణ రాజుకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

న్యూ డిల్లీ మే 21 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );పశ్చిమగోదావరిజిల్లా నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు కి సుప్రీం కోర్టు లో ఊరట లభించింది. అయన షరతులతో కూడిన బెయిల్ సుప్రీం కోర్టు మంజూరు చేసింది.  ఈ బెయిల్ కేవలం అయన ఆరోగ్య పరిస్థితిని దృష్టి లో పెట్టుకొని మాత్రమే కండీషనల్  బెయిల్ మంజూరు చేసింది.   ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అయితే సొంత పూచీకత్తు ఇద్దరు జామీనుదారులతో లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్ తీసుకోవచ్చని వెల్లడించింది. గుంటూరు సీఐడీ కోర్టులో వీటిని దాఖలు చేసి బెయిల్ తీసుకోవాలని సూచించింది.   ఆయనకి బెయిల్ ఇచ్చింది కేవలం అయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే కావడంతో అయన కేసు అలాగే కొనసాగనుంది. దీనితో దర్యాప్తు అధికారి పిలిస్తే విచారణకు వెళ్లాలి. ఆ దర్యాప్తు న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలి. అలాగే 24 గంటల ముందు అయనకి సమాచారం ఇవ్వాలని అన్నారు.  ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదు. దర్యాప్తును ప్రభావితం చేయకూడదు.  మీడియా సోషల్ మీడియాలో ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here