Spread the love

భక్తి శ్రద్ధలతో శ్రీ సూర్యనారాయణ స్వామి పూజలు
పవిత్ర మాఘ ఆదివారం సందర్భంగా చిత్రపురి కాలనీలోని సత్సంగ సమాజం సభ్యులు, ప్రత్యక్ష దైవమయిన శ్రీ సూర్యనారాయణ స్వామికి పూజలు చేసి, సామూహికముగా పాలు పొంగించు కార్యక్రమం , ఈ రోజు ఉదయం ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సామూహిక ఆదిత్య హృదయ పారాయణతో భక్తి పాటలలో చిత్రపురి కాలని ప్రాంగణమంతా పులకించి పోయింది. కార్యక్రమంలో సత్సంగ సమాజం సభ్యులు నళిని, కుమారి, దత్త, విద్యుల్లత, చండ్ర లక్ష్మి, లక్ష్మీకుమారి, లలిత తదితరులు పాల్గొన్నారు. చిత్రపురి కాలని కౌన్సిలర్ హైమాంజలి, చిత్రపురి కాలని హౌజింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటి సభ్యురాలు దీప్తి వాజపేయి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సంస్థ వ్యవస్థాపకులు యస్ యస్. వాజపేయి ఈ సందర్భంగా మాట్లాడుతూ, త్వరలో ప్రతి సంకష్ట చతుర్థికి చిత్రపురి కాలనీలో గల శ్రీ వినాయక స్వామి దేవాలయంలో గణపతి హోమం నిర్వహించచనున్నట్లు తెలియజేశారు.
