జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి

0
177
Spread the love

జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన 47 జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రీడాకారులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలడంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో సుమారు 2 వేల మంది గ్యాలరీ కూర్చున్నట్లు సమాచారం. సామర్థ్యానికి మించి ప్రేక్షకులు గ్యాలరీలో కూర్చున్న కారణంగానే కూలినట్లు తెలుస్తున్నది.

బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన మంత్రి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో కబడ్డీ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్యాలరీ కూలి ప్రేక్షకులు గాయపడిన ఘటనపై మంత్రి జగదీశ్‌ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. సూర్యాపేట ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు.
సూర్యాపేట స్టేడియం ప్రమాదం పట్ల గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి.

దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన గవర్నర్

సూర్యాపేటలోని కొత్తగా నిర్మించిన స్టేడియంలో 47వ జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ప్రమాదం పట్ల గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజ న్ తీవ్ర దిగ్భ్రాంతి ని వ్యక్తం చేశారు. గాయ పడిన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని గవర్నర్ ఆదేశించారు. ప్రమాదంలో చాలామంది గాయపడడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరు పట్ల అధికారులను అడిగి తెలుసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here