*అనుమ‌తిలేనిదే ప్ర‌చార సామాగ్రి ముద్రించ‌రాదు*

0
111
Spread the love

*అనుమ‌తిలేనిదే ప్ర‌చార సామాగ్రి ముద్రించ‌రాదు*

ప్ర‌స్తుతం జ‌రిగే ఎన్నిక‌ల్లో ముంద‌స్తు అనుమ‌తి లేకుండా క‌ర‌ప‌త్రాలు, పోస్ట‌ర్లు, బ్యాన‌ర్లను ముద్రిస్తే సంబంధిత ప్రింట‌ర్ల‌పై ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళిని అనుస‌రించి త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టడం జ‌రుగుతుంద‌ని హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి హెచ్చ‌రించారు. నేడు హైద‌రాబాద్ జిల్లాలోని ప్రింట‌ర్ల య‌జ‌మానుల‌తో జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌పై ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించారు. హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల జాయింట్ క‌మిష‌న‌ర్ దాస‌రి హ‌రిచంద‌న, ఎన్నిక‌ల నియ‌మావ‌ళి అమ‌లు నోడ‌ల్ అధికారి, హైదరాబాద్ జాయింట్ క‌లెక్ట‌ర్ ర‌వి, ఎన్నిక‌ల వ్య‌య నోడ‌ల్ అధికారి ద్రాక్ష‌మ‌ణిలు ఈ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈ క్రింది ఆదేశాలు జారీచేశారు.

*పోస్ట‌ర్స్‌, పాంప్లెట్స్ ప్రింటింగ్‌లో తీసుకొన‌వ‌లిసిన జాగ్ర‌త్త‌లు:*
ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టం 1951 – Sec 127A ప్ర‌కారం

* రాజ‌కీయ పార్టీలు/ పోటీచేయు అభ్య‌ర్థులు, వారు ప్రింట్ చేయించ‌ద‌ల్సిన పోస్ట‌ర్స్/ క‌ర‌ప‌త్ర‌ములు/ హాండ్ బిల్స్ మ‌రియు ఇత‌ర‌ సంబంధించి డిక్ల‌రేష‌న్ ప్రింట‌ర్ కి ఇవ్వాలి.
* ప్రింట‌ర్ తాను ప్రింట్ చేసిన క‌ర‌ప‌త్ర‌ములు/ పోస్ట‌ర్స్/ హాండ్ బిల్స్ పైన ప్ర‌చూర‌ణ క‌ర్త పేరు, ప్ర‌చూరించిన సంఖ్య మ‌రియు ప్రింట‌ర్ వివ‌ర‌ముల‌ను విధిగా ప్రింట్ చేయాలి.
* ప్రింట‌ర్ తాను ప్రింట్ చేసిన ప్ర‌తి పోస్ట‌ర్ మ‌రియు క‌ర‌ప‌త్ర‌ముల‌కు సంబంధించిన స‌మాచార‌మును APPENDIX-B యందు పూర్తిచేసి, ప్రింట్ చేయ‌బ‌డిన ఒక కాపిని జ‌త‌ప‌ర్చి జిల్లా ఎన్నిక‌ల అధికారికి అంద‌జేయాలి.
* పై సూచ‌న‌ల‌ను విధిగా పాటించాలి.
* ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టం 1951 సెక్ష‌న్ 127 ప్ర‌కారం:
* ప్ర‌చూర‌ణ క‌ర్త పేరు, ప్రింట‌ర్స్ పేరు లేని క‌ర‌ప‌త్ర‌ములు ముద్రించిన‌చో ముద్రించిన వారికి, 6నెల‌ల జైలు శిక్ష‌, లేదా రూ. 2000/- లు జ‌రిమానా లేదా రెండునూ విధించ‌డము జ‌రుగుతుంది.
* పోటీ చేయు అభ్య‌ర్థి అనుమ‌తి లేకుండా ప్ర‌చురించిన‌చో, ప్ర‌చురించిన వ్య‌క్తిపై భార‌త శిక్షాస్మృతి 171 H ప్ర‌కారం చ‌ర్య‌లు గైకొన‌బ‌డును.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here