నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది – మంత్రి తలసాని

0
43
Spread the love

నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్


నారాయణ జొంపిడి కాలనీలో రూ. 22.94 కోట్ల అంచనా వ్యయంతో 296 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి


హైదరాబాద్, జూన్ 03: 
  నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండదండగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని  రసూల్ పుర నారాయణ జొంపిడి కాలనీకి చెందిన నిరుపేదలకు రూ. 22.94 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 296 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, కంటోన్మెంట్ శాసన సభ్యులు సాయన్న, జిల్లా కలెక్టర్ శర్మన్ తో కలిసి మంత్రి తలసాని శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ… పేదల పక్షపాతి కేసీఆర్ అని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని అన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్రం దేశంలో ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు ఏడాది లోపు పూర్తి చేయాలన్నారు. ఇళ్లు పూర్తయిన తర్వాత జొంపిడి కాలనీ కాదని నారాయణ డిగ్నిటీ కాలనీ అవుతుందన్నారు.



 కంటోన్మెంట్ ఏరియాలో గత ప్రభుత్వాల కాలంలో ప్రజలు త్రాగు నీరు, విద్యుత్, కనీస వసతుల కల్పన కరువై ఎన్నో ఇబ్బందులు పడ్డారని, శాసన సభ్యులు సాయన్న కృషి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కంటోన్మెంట్ ప్రజలకు త్రాగు నీటి వసతి కల్పించడంతో పాటు ఉచితంగా మంచినీరు సరఫరా చేస్తున్నట్లు మంత్రి వివరించారు. డబుల్ బెడ్ ఇళ్ల పై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు నయా పైసా ఇవ్వనవసరం లేదన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం అమలు చేయనున్న నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా వసతులు  కల్పించనున్నట్లు మంత్రి వివరించారు.  
   
రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ…  తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  సంక్షేమ పథకాల అమలులో నెంబర్ వన్ గా ఉందని అన్నారు. రాష్ట్రంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ద్వారా సుమారు 10 లక్షలు పైగా మంజూరు చేయగా అందులో 2.12 లక్షల మందికి పైగా షాది ముభారక్ పంపిణీ  చేసినట్లు తెలిపారు. నగరంలో  నిరుపేదలకు ఇంటి కల సాకారం చేసేందుకు  ఒక లక్ష గృహాలు మంజూరు చేసినట్లు  మంత్రి అన్నారు. 
 శాసన సభ్యులు సాయన్న మాట్లాడుతూ… 296 కుటుంబాలకు 23 కోట్ల వ్యయంతో  నిర్మించనున్నట్లు తెలిపారు. అన్ని వసతులతో వీలైనంత త్వరగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. ఎవ్వరూ నయా పైసా చెల్లించకుండా ఉచితంగా అందిస్తామన్నారు. 

ఈ సమావేశంలో బేవరేజ్ కార్పొరేషన్  చైర్మన్ నగేష్ జిల్లా కలెక్టర్ శర్మన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here