శాతాబ్దాల క్రితమే… 3D టెక్నాలజీ
భారతీయ కళా వైభావానికి
మచ్చుతునక ఈ శిల్పం
ఈ ఫోటోలో ఉన్న శిల్పం తమిళనాడులో ఉన్న తంజవూర్ దగ్గర వున్న దారుసురం పట్టణంలో ఉన్న ఐరవతేశ్వర ఆలయంలోనిది. కీ.శ. 1146-1172 కాలంలో మధ్య చోళ సామ్రాజ్యాన్ని పాలించిన రాజరాజు చోళ- 2 ఈ ఆలయ నిర్మించాడు. రాజరాజు చోళ- 2 తన పూర్వీకుల రాజధాని గంగాపురంను కాకుండా ఐరట్టాలి పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పాలించాడు. చోళుల ఇలవేల్పు అయిన ఈశ్వరుని పేరున ఈ దేవాలయం నిర్మించాడు. స్థలపురాణం ప్రకారం ఇంద్రుని వాహానం అయిన ఐరావతం దుర్వాస మహర్షి వారి శాపమువలన తన సహాజ వర్ణం అయిన శేతరంగు కోల్పోయి నల్లని ఛాయలోకి మారతుంది. ఈ దేవాలయంలో ఈశ్వరునికి తపస్సు చేసి ఇక్కడ వున్నకోనేరులో స్నాన మాచరించడంతో తిరిగి ఐరావతం తెలుపు వర్ణం పొందుతుంది.అందువలనే ఈ దేవలయం లోవున్న ఈశ్వరునికి ఐరవతేశ్వర అని పేరు వచ్చింది. చోళరాజులు కళాలను పోషించారు.వీరి కాలంలో శిల్ప కళలతోపాటు ఇతర కళలు కూడా ఆదరించపడ్డాయి. ఈనాడు మనం చూస్తున్న ఆధునిక టెక్నలెజి 3-D టెక్నాలెజీ అందుబాటులో లేని వందల సంవత్సరాల కు పూర్వమే 11వ శతాబ్దంలోనే 3డి టెక్నాలజీ తో అద్భుత శిల్పాలను చెక్కినారు అంటే ఆనాటి శిల్పకాళాకారుల గొప్పదనం ఆద్భుతమని చెప్పవచ్చు. ఈ ఫోటోలో కనిపిస్తున్న శిల్పం ఒక వైపు నుంచి చూస్తే గజేంద్రుడు ఇంకోవైపు వృషభం రెండూ కలగలిపి కనిపిస్తాయి మనం చూసే దృష్టికోణంను బట్టి మొదట ఏనుగు అల్లుకున్న ఎద్దు కనిపిస్తుంది, ఇంకో వైపు నుంచి చూస్తే ఎద్దు అల్లుకున్న ఏనుగును చూడవచ్చు. చాలా అద్భుతంగా ఉంది కదా… మీరు తమిళనాడు కు వెళ్ళినప్పుడు ఈ దేవాలయం ను సందర్శించండం మాత్రం మిస్ కాకండి.
