సీఎం జ‌గ‌న్ నైజం ఇదే – అయ్యన్నపాత్రుడు

0
105
Spread the love

సీఎం జ‌గ‌న్ నైజం ఇదే – అయ్యన్నపాత్రుడు
అమరావతి ఏప్రిల్ 24 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ) ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి‌కి ఎవరో ఒకరిని అరెస్ట్ చేయించడం, అద్దంలో చూసుకొని ఆనందపడటం అలవాటైందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. శనివారం అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌తో జగన్ దారుణమైన సంఘటనకు పాల్పడ్డాడని మండిపడ్డారు. నరేంద్రకు, ఆయన కుటుంబానికి ప్రజల్లో ఎంతటి ప్రేమాభిమానాలుంటే 5సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తాడన్నారు. అలాంటి వ్యక్తిని అన్యాయంగా ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర చేసిన తప్పేమిటి… సంగం డెయిరీని కంపెనీ యాక్ట్ పరిధిలోకి తీసుకురావడమా? అని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. అదేపని నల్గొండ డెయిరీ, విశాఖ డెయిరీ నిర్వాహకులు కూడా చేశారని గుర్తుచేశారు. వారినెందుకు ఈ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయించలేదు? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.విశాఖ డెయిరీ నిర్వాహకులు వైసీపీవారనా… లేక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్రలో భోజనాలు, మంచినీళ్లు, మజ్జిగ పంపిణీ చేశారనా? అని నిలదీశారు. విశాఖ డెయిరీ, నల్గొండ డెయిరీలు కంపెనీ యాక్ట్‌లోకి రావడం ఒప్పయినప్పుడు, సంగం డెయిరీని తీసుకురావడం తప్పెలా అవుతుంది? అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. సంగం డెయిరీ తరుపున ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఆస్పత్రి నిర్మించి పేదలకు నాణ్యమైన వైద్యసేవలందించాలని చూడటమే నరేంద్ర చేసిన తప్పా? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఏసీబీ, సీఐడీ విభాగాలు స్వతంత్ర సంస్థలని మర్చిపోతే ఎలా? అని నిలదీశారు. ఆధారాలు లేకుండా, మంచీ చెడూ ఆలోచించకుండా ముఖ్యమంత్రి చెప్పాడని చెప్పి, ఇష్టానుసారం వ్యవహరిస్తారా అని మండిపడ్డారు. తప్పుచేసిన వారిని అరెస్ట్ చేయండి.. అంతేగానీ ముఖ్యమంత్రి ఎవరి పేరు చెబితే వారిని అరెస్ట్ చేయడం సరికాదని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here