బీజేపీతో లాలూచీ రుజువు చేస్తున్న జగన్ ఇంటర్య్వూ: కంభంపాటి రామ్మోహ‌న్ రావు

0
663
Spread the love

 

బీజేపీతో లాలూచీ రుజువు చేస్తున్న జగన్ ఇంటర్య్వూ: కంభంపాటి రామ్మోహ‌న్ రావు

ఒక జాతీయ పత్రికకు జగన్ ఇచ్చిన ఇంటర్యూ ఆత్మస్తుతి పరనిందగా వుంది. అలాగే అది బీజేపీతో లాలూచీ అని రుజువు చేస్తోంది. వాస్తవాలను వక్రీకరిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వమని బీజేపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసింది. అయినా కూడా బీజేపీని ఓడిస్తామని చెప్పకుండా హోదా ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకే మద్దతిస్తామని ప్రకటించడం ప్రజలను మోసం చేయడం కాదా? కడప స్టీల్ పాయింట్, విశాఖ రైల్వే జోన్, వెనుకబడ్డ జిల్లాలకు రూ.350 కోట్లు ఇచ్చి తిరిగి ప్రధాని కార్యాలయం వెనక్కి తీసుకోవడాన్ని జగన్ తన ఇంటర్య్వూలో ఎక్కడా ఖండించలేదు. అలాగే మన్నవరం ప్రాజెక్టు, రామాయపట్నం పోర్టు విషయం ప్రస్తావనే లేదు. విభజన చట్టంలోని 19 హామీల ప్రస్తావనే లేదు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ని ఖండించలేదు. 8.9.2016న ఆర్థిక మంత్రి జైట్లీ ఇస్తామన్న స్పెషల్ అసిస్టెన్స్ 18 నెలలైనా అమలు చేయకుండా యు టర్న్ తీసుకొని ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం జీఎస్టీ, ఐటీ లాంటి సౌకర్యాలు కల్పిస్తూ రెండు జీవోలు జారీ చేశారు. ఈశాన్య రాష్ట్రాలకిచ్చినవి ఏపీకి ఎందుకు ఇవ్వరని జగన్ తన ఇంటర్యూలో ఎందుకు ప్రశ్నించలేదు? అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు దుయ్య‌బ‌ట్టారు.

ఆయ‌న ఈ రోజు మీడియాతో ఈ వ్యాఖ్య‌లు చేశారు. నంద్యాల ఎన్నికల్లో టీడీపీ ఒంటరి పోరాటం చేసింది. బీజేపీ, జనసేన మద్దతు లేకపోయినా.. టీడీపీ 16 శాతం ఓట్లు అధికంగా తెచ్చుకుంది. చంద్రబాబునాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల, కేంద్రంతో చేస్తున్న తెలుగు ప్రజల ఆత్మగౌరవ పోరాటం వల్ల ప్రజల్లో నేడు 76% సంతృప్తి ఉంది. 2014 శాసనసభ ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, పవన్ పొత్తు లేకుండా తెలుగుదేశం మెజార్టీ స్థానాలను గెలుచుకున్న విషయాన్ని జగన్ దాచాలన్నా దాయలేరు. కంభంపాటి విమ‌ర్శించారు.

రైతు రుణమాఫీ విషయంలో లోటు బడ్జెట్ ఉండి కూడా చంద్రబాబు ప్రభుత్వం రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేసింది. మిగులు బడ్జెట్ ఉన్నా వైఎస్ ప్రభుత్వం 2008లో కేవలం రూ.650 కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ తీర్చారు. జగన్ రుణమాఫీనే సాధ్యం కాదన్నారు. రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదు. చేసుకున్న ఒప్పందాల్లో సుమారు 6% మాత్రమే పెట్టుబడులు వైఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో 46% పెట్టుబడులను రాబట్టగలిగింది. ఈ వాస్తవాలను జగన్ వక్రీకరిస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. 2014లో జగన్తో ఉన్న బలమైన 21 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఇప్పుడు అతనితో లేరు. అసెంబ్లీని, పార్లమెంటును బహిష్కరించడం ద్వారా జగన్ ప్రజల్లో అభాసుపాలయ్యారు. నమ్మకద్రోహం చేసిన బీజేపీతో లాలూచీ వల్ల జగన్ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. మైనార్టీలు, దళితులు జగన్ విధానాలను అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలతేగానీ, వ్యతిరేకత ఎక్కడా లేదు. అభివృద్ధి, సంక్షేమం ఎన్నడూ జరగనంత చంద్రబాబు పాలనలో జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం తిరిగి ఎక్కువ అసెంబ్లీ సీట్లతో అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి, అలాగే కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రాదని కూడా సర్వేలు ఘోషిస్తున్నాయి. జగన్ 2019లో నామమాత్రపు స్థాయికి పడిపోవడం ఖాయం. అని ఆయ‌న జోస్యం చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here