ఆయుష్మాన్‌ భారత్‌ పై ఎన్‌హెచ్‌ఏ తో తెలంగాణా ప్రభుత్వం ఒప్పందం

0
135
Spread the love

ఆయుష్మాన్‌ భారత్‌ పై ఎన్‌హెచ్‌ఏ తో తెలంగాణా ప్రభుత్వం ఒప్పందం

హైదరాబాద్ మే 24 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన(ఏభీపీఎంజేఏవై) పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసే క్రమంలో… రాష్ట్ర ప్రభుత్వంతో నేషనల్‌ హెల్త్‌ అథారిటీ(ఎన్‌హెచ్‌ఏ)ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ పథకాన్ని ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆరోగ్య శ్రీపథకంతో మిళితం చేసి ఆయుష్మాన్‌ భారత్‌ పీఎంజే ఆరోగ్య శ్రీగా వ్యవహరించనున్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ పీఎంజె పథకాన్ని తెలంగాణాలో అమలులోకి తీసుకురావడం ద్వారా ఇది దేశంలో 33 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించినట్లైంది. దీని ద్వారా ఎస్‌ఈసీసీ డాటా 2011 ప్రకారం తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 26 లక్షల కుటుంబాలు (దాదాపు 1.3కోట్ల మంది వ్యక్తులు) లబ్ధి పొందనున్నాయి. ఈ పథకం ద్వారా  ఒక్కో కుటుంబం సంవత్సరానికి రూ. 5 లక్షల మేరకు ఉచిత ఆరోగ్య భీమా కవరేజీని పొందుతుంది. ఈ ఆరోగ్య సేవలు దేశవ్యాప్తంగా నమోదు చేసుకున్న 22 వేల ఆసుపత్రుల్లో లభ్యమవుతాయి. ఎన్‌హెచ్‌ఏతో పాటుగా రాష్ట్ర ఆరోగ్య ఏజెన్సీలు అర్హులైన లబ్ధిదారులకు ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఈ సమ్మిళిత పథకం ద్వారా ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలనందించనుంది. ఈ సందర్భంగా నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈఓ డాక్టర్‌ ఆర్‌ ఎస్‌ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏబీపీఎం జే పథక అమలు కోసం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలుపడం హర్షణీయం. రాష్ట్రంలోని లబ్ధిదారులు ఇప్పుడు దేశవ్యాప్తంగా 22 వేల నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో సేవలు పొందేందుకు అర్హులుఅని వెల్లడించారు. ఇక… రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలతో పాటుగా తెలంగాణా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెంది నివాసముంటున్న వారికి సైతం ఇది  ప్రయోజనం కలిగించనుంది. ‘మా కాల్‌ సెంటర్‌కు ఇప్పటికే రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రజల నుంచి కాల్స్‌ వస్తున్నాయి. అర్హత కలిగిన లబ్ధిదారులకు ఈ పథకం ప్రయోజనాలను అందించేందుకు కట్టుబడి ఉన్నాంఅని స్పష్టం చేశారు. ఇక… ఈ పథకానికి సంబంధించి తమ తమ అర్హతను తెలుసుకునేందుకుగాను లబ్ధిదారులు 14555 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేయవచ్చు. అలాగే ఈ పథక ప్రయోజనాలను ఏ విధంగా పొందవచ్చో కూడా  తెలుసుకునే వెసులుబాటు ఉంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here