సిబ్బందిని శాశ్వతంగా ప్రభుత్వ కళాశాలలో విలీనం చేయాలి

0
164
Spread the love

(TOOFAN – Hyderabad) రాష్ట్రంలోని రీడిప్లైడ్ ఎయిడెడ్ డిగ్రీ, జూనియర్ కళాశాల సిబ్బందిని శాశ్వతంగా ప్రభుత్వ కళాశాలలో విలీనం చేయాలని జే.ఏ.సీ. నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఖైరతాబాద్ అంబేద్కర్ భవన్లో ఆదివారం జరిగిన రా ష్ట్ర జూనియర్, డిగ్రీ కళాశాల కాలేజ్ స్టాఫ్ అసోసియేషన్ నాయకులు సమావేశమై జాయింట్ ఆక్షన్ కమిటీ( జేఏసీ) ఏర్పాటు చేశారు. ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న టీచింగ్- నాన్ టీచింగ్ సిబ్బంది ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నారని వారు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నందువల్ల వారి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించడానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేదని వారు తెలిపారు. రాష్ట్రంలోని రీడిప్లైడ్ ఎయిడెడ్ డిగ్రీ, జూనియర్ కళాశాలలో సిబ్బందిని వెంటనే ప్రభుత్వ కళాశాలలో శాశ్వత ఉద్యోగులుగా చేసి ఉన్నత విద్యాశాఖను బపేతానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అత్యంత అనుభవం గల సీనియర్ టీచర్స్ ప్రభుత్వ కళాశాలలో రావడం వల్ల డిగ్రీ, జూనియర్ కళాశాలలో బలపేతం అవుతాయని వారు తెలియజేశారు. ఈ సమావేశంలో డాక్టర్ అమృత కుమార్ ,డాక్టర్ తిరుపతి డాక్టర్ జగన్మోహన్, డాక్టర్ గిరిధర్,అజయ్, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ నిర్మల డాక్టర్ బి లక్ష్మయ్య, ప్రభాకర్ ఆర్. కృష్ణయ్య, కృష్ణారావు, అజయ్ కుమార్, మహ్మద్ నయీముద్దీన, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్, డిగ్రీ కాలేజీ, జేఏసీగా ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారులతో విద్యాశాఖ మంత్రితో సమావేశం కావాలని ఈమేరకు సమావేశం నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here