ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ-2021 పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తో సమావేశం

0
77
Spread the love

‘హైదరాబాద్, అక్టోబర్ 03: తేది 03-10-20 న 11am కు ఫోటో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ-2021 పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తో జి హెచ్ ఎం సి ప్రధాన కార్యాలయంలో సమావేశం జరిగింది.
* ఎన్నికలు విభాగం అదనపు కమీషనర్ ఎస్. పంకజ ఫోటో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్ గురించి వివరించారు.
*తేది 01-01-2021 ప్రామాణిక తేదీగా పరిగణిస్తూ ఈ ప్రత్యేక సవరణ జరుగుతుంది.
*హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గములో ప్రస్తుతం ఉన్న మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య : 3977.
* మొత్తం పోలింగ్ లొకేషన్స్ : 1,586.
*తేది 07-02-20 పబ్లిష్ చేసిన ఫైనల్ ఎలెక్టోరల్ రోల్స్ ప్రకారం మొత్తం ఓటర్లు సంఖ్య: 42 లక్షల 37 వేల 190.
*పోలింగ్ కేంద్రాల రేషనలైజెషన్, హద్దుల మార్పు, తుది పోలింగ్ కేంద్రాల ఆమోద ప్రక్రియ తేదీ 31-10-20 లోపు పూర్తి చేయాలి.
*ఫార్మాట్స్ -1 నుండి 8 వరకు వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అనుబంధ, ఇంటిగ్రేటెడ్ ముసాయిదా ఓటరు జాబితా తయారు ప్రక్రియ :01-11-20 నుండి 15-11-20 వరకు..
*Publication of Integrated draft electoral roll: 16-11-20.
*క్లెయిమ్స్, అభ్యంతరము ల స్వీకరణ : 16–11-20 నుండి 15 -12-20 వరకు.
*పైన పేర్కొన్న పీరియడ్ లో చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ నిర్దేశించిన రెండు శనివారములు, ఆదివారము లలో క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలుకు స్పెషల్ కాంపైన్ తేదీలు ప్రకటించడం జరుగుతుంది.
*క్లెయిమ్స్, అభ్యంతరాలు పరిష్కారం : 05-01- 2021 లోపు.
*ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఎలెక్టోరల్ రోల్ : 15-01-2021.
*ఈ సందర్బంగా మహబూబ్ నగర్ – రంగారెడ్డి -హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఓటరు నమోదు, జాబితా రూపొందించేందుకు SEC జారీ చేసిన షెడ్యూల్ గురించి వివరించారు.

* ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పై ఈ సమావేశంలో చర్చించిన అంశాలు

-ఉన్న పోలింగ్ కేంద్రాల భవనాలు కూల్చివేయుట వలన 72 పోలింగ్ కేంద్రాల లొకేషన్స్ మార్చుటకు ప్రతిపాదనలు.
-అలాగే మరో 16 పోలింగ్ కేంద్రాల Nomenclature ( పేర్లు మార్పు )కు ప్రతిపాదనలు.
-ఇది ప్రాధమిక సమావేశం.ఈ ప్రతిపాదనలు గురించి మీ అభిప్రాయాలు తెలియజేయాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. పాటు కొత్త ఏమైనా పోలింగ్ కేంద్రాల లొకేషన్స్ లో మార్పులు గురించి మీ దృష్టిలో ఉంటే వెంటనే ప్రతిపాదనలు చేయాలి.
-సోమవారం నాడు నియోజకవర్గముల వారిగా ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలతో సమావేశం జరుగుతుంది.
*నియోజకవర్గ స్థాయిలో జరిగే సమావేశంలో కూడా మార్పులు గురించి ఇచ్చే ప్రతిపాదనలు ప్రతులను కూడా జి హెచ్ ఎం సి ఎన్నికలు విభాగం లో ఇవ్వండి.
*ఈ సమావేశంలో టి ఆర్ ఎస్ నుండి ప్రొ. ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎస్ భరత్ కుమార్, బిజెపి నుండి పొన్న వెంకట్ రమణ, కొల్లూరు పవన్ కుమార్, కాంగ్రెస్ నుండి మర్రి శశిధర్ రెడ్డి, జి. నిరంజన్, పి రాజేష్ కుమార్, ఎం ఐ ఎం నుండి సయ్యద్ ముస్తాక్ అహ్మద్, తెలుగుదేశం నుండి జి రాజా చౌదరి, పి రామచంద్ర చారి, సి పి ఎం నుండి ఎం శ్రీనివాసరావు, సి పి ఐ నుండి ఎన్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

D Balakrishna, chief Editor - TOOFAN Telugu News Daily. This News Paper and News website runs from Hyderabad, Telangana State India. Telugu breaking news and Current Affairs, Sports, Crimenews, Fashion, Life style, Cricket, Cinema, Tollywood News updates. Political News of India and Telugu States Telangana and Andhrapradesh.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here