స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణం 2018 అమలులో తెలంగాణకు మూడు జాతీయ అవార్డులు

0
582
Spread the love

స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణం 2018 అమలులో తెలంగాణకు మూడు జాతీయ అవార్డులు

స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణం 2018 అమలులో అత్యుత్తమ ప్రగతి సాధించినందుకు తెలంగాణ ప్రభుత్వం మూడు జాతీయ స్థాయి అవార్డులు దక్కించుకుంది. అవి స్వచ్చ భారత్ లో ఒక జాతీయ స్థాయి అవార్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు స్వచ్చ సర్వేక్షన్ లో రెండు జాతీయ స్థాయి అవార్డులను పెద్దపల్లి జిల్లా మరియు వరంగల్ అర్బన్ జిల్లాకు వరించాయి. ఈ అవార్డులను తేది 02.10.2018 మంగళవారం రోజున కేంద్ర త్రాగునీరు మరియు పారిశుధ్య శాఖ మంత్రిత్వ శాఖ వారి చేత “ప్రవాస భారతీయ కేంద్ర”, న్యూ ఢిల్లీ లో అందుకుంటారు. స్వచ్ఛ గ్రామీణభారత్ మిషన్ వారి ప్రమాణాలకనుగుణంగా జిల్లాల పనితీరు ఆధారంగా రాష్ట్రాలను జిల్లాలకు ర్యాంకింగ్లు ఇవ్వడం జరిగింది. అందులో విద్యాపర, సమాచారయుక్త చైతన్యాన్నందించి, వారి పారిశుధ్యపరిస్థితుల మెరుగుదలకు కృషిలో గ్రామీణ సమూహాన్ని పాల్గొనేలా చేయుడమైనది, స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ) ప్రమాణాల ప్రకారంగా రాష్ట్రస్థాయిలో ఆయా జిల్లాల మధ్య, జాతీయస్థాయిలో రాష్ట్రాల, జిల్లాల మధ్య పనితీరులను తులనాత్మక పరిశీలన చేయడమైనది. స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ)ను అమలుచేస్తున్న అన్ని జిల్లాల, గ్రామాలలోని బడులు, అంగన్ వాడీలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, సంత బజార్లు, మతపరమైన ప్రదేశాల వంటి బహిరంగ ప్రదేశాలలో పారిశుధ్యపురోగతి పొందడం వంటి లక్ష్యాలతో చేపట్టిన కార్యక్రమాలకు గాను జాతీయ స్థాయి ఆవర్డను దక్కించుకోవడమైనది. అదే విధంగా ఈ పథకంలో కల్పించిన అన్ని ఆస్తులకు భువన్ సాఫ్ట్ వేర్ ద్వార జియో ట్యాగింగ్ చేయడంతో అత్యంత ఎక్కువ ఆస్తులను కంప్యూటరీకరించడమైనది. శ్రీ వికాస్ రాజ్ ఐ.ఏ.ఎస్, ముఖ్య కార్యదర్శి గ్రామీణాభివృద్ధి శాఖ, శ్రీమతి నీతూ ప్రసాద్, ఐ.ఏ.స్, కమీషనర్ గ్రామీణ అభివృధి శాఖ గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందుకొనున్నారు .
అదే విధంగా, స్వచ్చ సర్వేక్షన్ లో భాగంగా దేశం లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన జిల్లాలలో పెద్దపల్లి మరియు వరంగల్ అర్బన్ జిల్లాలు ఈ అవార్డును పొందాయి. సంబందిత జిల్లా కల్లెక్టర్లు ఈ అవార్డులను న్యూ డిల్లీ లో 2 అక్టోబర్ 2018 న అందుకొనున్నారు.
ఈ ఆవార్డులను జాతీయ స్థాయిలో అందుకోవడం చాల సంతోషంగా ఉందన్నారు. ఇది గ్రామీణ స్థాయిలో పని చేసే ప్రతి సిబ్బంధి దగ్గరి నుండి రాష్ట్ర స్థాయి అధికారుల యొక్క కృషి ఫలితమని అన్నారు. ఈ అవార్డ్ ల ప్రదానమును స్పూర్తిగా తీసుకొని ఉత్సాహంగా ప్రతి సిబ్బంది, ప్రతి ప్రజా ప్రతినిధి పని చేసి రాష్ట్రాన్ని, దేశంలో ప్రధమ స్థాయిలో కూర్చోపెట్టాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here