తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గా రవి కుమార్
తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్* ( TGPA) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా హైదరాబాద్ కు చెందిన నెమలి రవి కుమార్ నియామకమయ్యారు.గురుకల పాఠశాలల విద్యార్థుల భవిష్యత్తు కోసం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందించాలని, సొంత భవనాలు లేని స్కూళ్లకు సొంత భవనాలు కట్టించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో గురుకులాల తల్లిదండ్రులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయనున్నట్టు అయన తెలియజేశారు. స్వేరో స్ రాష్ట్ర కన్వీనర్ కిరణ్ కుమార్, టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు మహేష్, మాజీ అధ్యక్షులు సదానందం, రాష్ట్ర నాయకులు సూరపల్లి నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.