జూనియర్‌ డాక్టర్ల చేపట్టిన సమ్మెకు దిగివచ్చిన ప్రభుత్వం 

0
76
Spread the love

జూనియర్‌ డాక్టర్ల చేపట్టిన సమ్మెకు దిగివచ్చిన ప్రభుత్వం 

15 శాతం స్టైఫండ్‌ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

హైదరాబాద్ మే 27 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ తెలంగాణలో జూనియర్‌ డాక్టర్లు(జూడాలు) చేపట్టిన సమ్మెకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. గురువారం జూడాలతో చర్చలు జరిపిన తర్వాత 15 శాతం స్టైఫండ్‌ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇవాళ మరోసారి డీఎంఈతో  జూడాల చర్చలు జరిగిన తర్వాత జూనియర్‌ డాక్టర్లకు స్టైఫండ్‌ పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వుల్లో పేర్కొంది. ఈ జీవోలో 15 శాతం స్టైఫండ్‌ పెంపుకు ఆమోదం తెలిపింది. పెరిగిన స్టైఫండ్‌ ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానుంది.  ఈ క్రమంలోనే సీనియర్‌ రెసిడెంట్లకు వేతనాలు రూ.70,000ల నుంచి రూ.80,500 వరకు పెరగనున్నాయి. ఈ రోజు జూడాల సమ్మె రెండో రోజుకు చేరగానేటినుంచి అత్యవసర సేవలను కూడా బంద్‌ చేస్తామని వారు హెచ్చరించారు. దాంతొ దిగివచ్చిన టీ సర్కార్‌ స్టైఫండ్‌ పెంపుకు ఆమోద ముద్ర వేసింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే 15 శాతం జీతాలు పెంచాలంటూ జూనియర్‌ డాక్టర్లు.. ఈనెల రెండో వారంలో ప్రభుత్వానికి లేఖ రాశారు. 10 శాతం ఇన్సెంటివ్ వెంటనే చెల్లించాలని జూడాల డిమాండ్ చేశారు.  2 వారాల్లో సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనిలో భాగంగా రెండు రోజుల క్రితం జూడాల సమ్మెకు దిగారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here