తండ్రిని మించిన దుర్మార్గుడు వైఎస్ జ‌గ‌న్: మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

0
182
Spread the love

తండ్రిని మించిన దుర్మార్గుడు వైఎస్ జ‌గ‌న్: మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

సూర్యాపేట జూలై 2 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ); : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై రాష్ర్ట విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి మండిప‌డ్డారు. కృష్ణా బోర్డు ఆదేశాల‌ను తెలంగాణ బేఖాత‌రు చేస్తోంద‌ని, ప్రాజెక్టుల్లో ఏక‌ప‌క్షంగా విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తుంద‌ని ప్ర‌ధాని మోదీకి జ‌గ‌న్ లేఖ రాయ‌డాన్ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి త‌ప్పుబ‌ట్టారు. తండ్రిని మించిన దుర్మార్గుడు వైఎస్ జ‌గ‌న్ అని కోపోద్రిక్తుల‌య్యారు. మ‌ద్రాస్‌కు మంచినీటి పేరుతో వైఎస్సార్ కృష్ణా నీళ్ల‌ను దోచుకున్నారు. సాగ‌ర్ ఎడ‌మ కాల్వ కింద రైతాంగానికి 50 ఏండ్లు ద్రోహం చేశార‌ని మండిప‌డ్డారు. దౌర్జ‌న్యం, బెదిరింపుల‌తో శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్ గేట్లు తెరిపించి.. తెలంగాణ రైతుల‌కు అన్యాయం చేశారు.ఏపీ అక్ర‌మంగా నీటిని త‌ర‌లించుకుపోతే ఊరుకునేది లేద‌న్నారు. సీఎం కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ హ‌క్కుల్ని ఎవ‌రూ హ‌రించ‌లేరు అని స్ప‌ష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు క‌ట్టింది జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తి కోస‌మేన‌ని, చట్ట‌ప‌రంగా విద్యుత్ ఉత్ప‌త్తి కొన‌సాగుతోంద‌న్నారు. త‌ప్పు చేసిన వారే లేఖ‌ల పేరుతో నాట‌కాలు ఆడుతున్నార‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి మండిప‌డ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here