ఎన్.వై.కె.ఎస్ ఆధ్వర్యంలో ఆదివాసీ సమ్మేళనం

0
85
Spread the love

ఎన్.వై.కె.ఎస్ ఆధ్వర్యంలో ఆదివాసీ సమ్మేళనం

హైదరాబాద్, జనవరి 5, 2022 – తెలంగాణ నెహ్రూ యువ కేంద్ర సంఘటన (ఎన్.వై.కె.ఎస్) ఆధ్వర్యంలో జరుగుతున్న 13వ ఆదివాసి సమ్మేళనం మూడవరోజు ఐసిఎమ్ రాజేంద్రనగర్ లో జరిగింది. సుమారు రెండు వందల మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమ్మేళనం లో భాగంగా ‘కెరీర్ గైడెన్స్ అండ్ ప్లానింగ్’ అనే అంశంపై రంగారెడ్డి జిల్లా జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎం.డి. హమీద్ పాల్గొని ప్రసంగించారు. సెమినార్ లో హిందీ మహా విద్యాలయ ప్రొఫెసర్ శ్రీ వి.పి.సింగ్ ‘జాతి నిర్మాణం-దేశభక్తి’ అనే అంశంపై అవగాహన కల్పించారు. అనంతరం ‘జాతి నిర్మాణం-దేశ భక్తి’ పై వ్యక్తిత్వ వికాస పోటీలు నిర్వహించి, విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా సమాచార, పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ D.S. జగన్, చంచల్ గూడ డిగ్రీ కాలేజీ, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటరమణ, పాల్గొన్నారు. ఎన్.వై.కె.ఎస్ అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here