గెలిస్తే జానా..ఓడితే  రేవంత్ ..

0
198
Spread the love

గెలిస్తే జానా..ఓడితే  రేవంత్ ..

    తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి పై ఉత్ఖంట

హైదరాబాద్ ఏప్రిల్ 17 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );కాంగ్రెస్ పెద్దలు  జానారెడ్డి చెప్పారని తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి నియామకాన్ని  ఇప్పటిదాకా ఆపేశారు. లేకుంటే ఫిబ్రవరిలోనే టీపీసీసీకి కొత్త చీఫ్ వచ్చేవారు. సాగర్ ఉప ఎన్నిక వరకు ఆపాలని జానారెడ్డి విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ అధిష్టానం పక్కనపెట్టేసింది.అయితే ఇటీవల సాగర్ ఉప ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ వచ్చారు. సాగర్ ఉప ఎన్నికల తర్వాత టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ వేగవంతం చేస్తామని నేతలకు చెప్పారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ టీపీసీసీ చీఫ్ రేసు మొదలైంది.తెలంగాణలో కునారిల్లుతున్న పార్టీని గట్టెక్కించేందుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ను మార్చాలని అధిష్టానం డిసైడ్ అయ్యింది. తెలంగాణలో బలం పుంజుకుంటున్న బీజేపీకి చెక్ చెప్పాలంటే  రేవంత్ రెడ్డి లాంటి యువకుడు మాస్ ఫాలోయింగ్ గల నేత అవసరం అని ఫిక్స్ అయ్యింది. పీసీసీ చీఫ్ రేసులో కోమటిరెడ్డి శ్రీధర్ బాబు సహా ఇతర నేతలు బరిలో ఉన్నా రేవంత్ వైపే మొగ్గు కనిపిస్తోందని అంటున్నారు.
అయితే పీసీసీ చీఫ్ పదవి ఎంపిక విషయంలో జానారెడ్డి కీలకం అని అంటున్నారు. ఆయనే మాట ప్రకారమే వాయిదా వేశారని.. ఆయన చెబితే పీసీసీ చీఫ్ పదవి ఇస్తారని అంటున్నారు. అందుకే జానారెడ్డిని గెలిపించడానికి రేవంత్ రెడ్డి సాగర్ లో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన మెప్పు కోసం తపనపడుతున్నారట..మొత్తంగా సాగర్ ఉప ఎన్నికల తర్వాత జానారెడ్డి గెలిస్తే టీపీసీసీ చీఫ్ గా ఆయనే అవుతాడా? ఓడితే రేవంత్ కు చాన్స్ ఉంటుందా? లేక ఓడినా గెలిచానా రేవంత్ రెడ్డిని ఫిక్స్ చేశారా? అన్నది కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జానారెడ్డి సైతం ఈ విషయంలో కీలకంగా వ్యవహరించబోతున్నట్టు ప్రచారం సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here